Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్ షో టాక్: మన జవాబు
By: Tupaki Desk | 10 July 2015 9:27 AM ISTదొరికేసింది. మన జవాబు దొరికేసింది. ఎన్నాళ్ళనుండో వెయిట్ చేస్తున్నాం. రేపు చెబుతాం, ఎల్లుండ చెబుతాం అంటూ కాలక్షేపం మాత్రమే చేశాం ఇన్నాళ్లూ.. అయితే ఇప్పుడు అలాంటి మాటలు చెప్పుకుంటూ బ్రతికేసి రోజులకు ఇక చెల్లు చీటి చింపేసేయవచ్చు. ఎందుకంటే రాజమౌళి అందరికీ ఆన్సర్ చెప్పేశాడు.
దాదాపు 100 కోట్ల వరకు ఖర్చుపెట్టినా కూడా.. రోబో, ఐ, రా.వన్ వంటి సినిమాలు ఎందుకో భారతదేశపు విజువల్ ఎఫెక్ట్స్ సత్తాను లోకానికి చాటనేలేదు. మనోళ్లు తీసిన సినిమాల్లో గ్రాఫిక్స్ వీకే అని ప్రూవ్ చేశాయి. ఒక సినిమాలో బాగున్నా కూడా అవి హయ్యారే అనిపించేంత రేంజులో లేవు. ఇకపోతే ఇప్పుడు ఇలా మనం బాధపడక్కర్లేదు. ఎందుకంటే రాజమౌళి తీసిన ''బాహుబలి'' మనోళ్ళు గట్టిగా ఫోకస్ చేసి గ్రాఫిక్స్ మీద కాన్‌సన్‌ట్రేట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించాడు. ముఖ్యంగా సినిమాలోని ప్రతీ ఫ్రేమూ మనమేదో కొత్త యుగం, కొత్త ప్రాంతం, కొత్త వాతావరణం చూస్తున్నట్లే తలపించాయి. ఎక్కడైనా సినిమా కాస్త స్లో అయినా కూడా ఈ కొత్త వాతావరణం మనల్ని మ్యాజిక్‌తో కట్టిపాడేస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో అంతే కదా.. సినిమా ఎలా ఉన్నా కూడా గ్రాఫిక్స్‌తో ఇంప్రెస్ చేస్తారు వారు. సో, ఇండియన్స్ కూడా హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయగలరు, తీశారు అనడానికి రాజమౌళిని మనం వారికి జవాబుగా చెప్పాల్సిందే. వెల్ డన్ జక్కన్న.