Begin typing your search above and press return to search.
బాహుబలి టీమ్ పిల్లాడిని కోసుకుతిందా?
By: Tupaki Desk | 13 July 2015 8:08 AM ISTకొన్నిసార్లు మనం చేసే పనులు బయటవారికి వేరే యాంగిల్స్‌లో కనిపిస్తాయి. వాటిని చూస్తే మనకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అదిగో నిన్న జరిగిన బాహుబలి సెలబ్రేషన్స్ ఫోటోలను చూస్తే కూడా ఇప్పుడు సేమ్ అలాంటి ఫీలింగే వచ్చింది. అసలు బాహుబలి సినిమాకు ఒక ఐకాన్‌గా నిలిచిన పోస్టర్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా నిటీలో నుండి ఓ చెయ్యి చిన్న పసికందును గాలిలోకి ఎత్తి పట్టుకోవడమే. పదండి అసలు ఏమైందో చూద్దాం.
బాహుబలి టీమ్ సెలబ్రేట్ చేసుకోవడానికి మనోళ్ళు ఒక కేక్ తయారు చేయించారు. ఓ దిమ్మపై ఓ చేయి ఒక పిల్లాడిని పట్టుకున్నట్లు ఆ కేక్ డిజైన్ ఉంది. సేమ్ టు సేమ్ మనం సినిమాలో పోస్టర్‌లో చూసినట్లే డిజైన్ చేశారు. బేష్. డిజైన్ ఇరగదీశారు. కాని ఆ కేక్‌ను కట్ చేసి తినడం అంటే ఓ పిల్లాడిని కట్ చేసుకొని తినడం కాదా? చాలామంది ఆ కేక్‌ను చూసినవెంటనే తొలుత ఇదే డౌట్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అయితే లక్ష్మిదేవి ఫోటో ఉన్న బాంబులను లక్ష్మీ బాంబ్ అని కాల్చేయట్లేదూ.. ఇదీ అంతే అనుకునేవారూ లేకపోలేదులే.. కాకపోతే మరీ ఓ కేక్‌ను చిన్న పసికందులా డిజైన్ చేయించి దానిని కోసుకు తినడం అనే కాన్సెప్టు కాస్త ఎబ్బెట్టుగానే ఉంది.