Begin typing your search above and press return to search.
'ఐ' రికార్డు బద్దలవడం ఖాయం
By: Tupaki Desk | 23 Jun 2015 3:15 PM ISTఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అంటారు ముంబయి జనాలు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. సౌత్ సినిమాను కూడా గుర్తించడం మొదలుపెడుతున్నారు బాలీవుడ్ జనాలు. ఓవైపు జాతీయ అవార్డుల్లో సౌత్ సినిమా సందడి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి చాలా సినిమాలు బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్నాయి. అంతే కాదు.. రజినీకాంత్, శంకర్ లాంటి వాళ్ల సినిమాలు రిలీజైనపుడు దేశవ్యాప్తంగా హంగామా కనిపిస్తోంది. రోబో నార్త్ ఇండియాలో కూడా సంచలనం రేపగా.. ఈ మధ్య 'ఐ' సినిమా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఐ హిందీ వెర్షన్ ఏకంగా 1300 థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది.
ఇప్పటిదాకా ఏ సౌత్ సినిమా కూడా హిందీలో ఈ స్థాయిలో విడుదలైంది లేదు. ఐతే 'ఐ' రికార్డు ఎంతో కాలం నిలిచి ఉండేలా లేదు. మన 'బాహుబలి' దెబ్బకు ఆ రికార్డు బద్దలైపోనుంది. కరణ్‌జోహార్ మామూలోడా మరి. తనకు నచ్చిన సినిమా ప్రేక్షకులకు కూడా బాగానే నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఏకంగా 2 వేల థియేటర్లలో బాహుబలి హిందీ వెర్షన్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట కరణ్ జోహార్. అంటే స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీస్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో 'బాహుబలి' దేశవ్యాప్తంగా సందడి చేయబోతోందన్నమాట. ఇక తెలుగు, వెర్షన్ కూడా 1500కు పైగా స్క్రీన్స్‌లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళం, మలయాళం కూడా కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' దాదాపు 4 వేల థియేటర్లలో విడుదలవుతుందని అంచనా.