Begin typing your search above and press return to search.

బాహుబలి.. అది కూడా ఓ రికార్డే

By:  Tupaki Desk   |   8 July 2015 3:00 PM IST
బాహుబలి.. అది కూడా ఓ రికార్డే
X
ఇంకా బొమ్మ పడలేదు. అప్పుడే రికార్డుల మోత మోగిపోతోంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ మీద అత్యధికంగా ఖర్చు పెట్టించిన భారతీయ సినిమా.. సౌత్‌ ఇండియా నుంచి అత్యంత భారీగా విడుదలవుతున్న సినిమా.. ఇలా ఇప్పటికే 'బాహుబలి' విషయంలో చాలా రికార్డులున్నాయి. ఇక విడుదల తర్వాత ఎన్ని రికార్డులు బద్దలవుతాయో చెప్పలేం. కాగా ఇండియాలో నభూతో అనిపించే ఇంకో రికార్డు కూడా బాహుబలి పేరిట నమోదవుతోంది. నాలుగు ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో ఒకేసారి విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా ఇదే కాబోతోంది.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ నెల 10న సమాతంరంగా విడుదలవుతోంది బాహుబలి. ఇప్పటిదాకా ఏ ఇండియన్‌ మూవీ కూడా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది లేదట. గతంలో కొన్ని హిందీ సినిమాలు రీజనల్‌ లాంగ్వేజెస్‌లో విడుదలయ్యాయి కానీ.. అవి సినిమా హిందీలో తీసి.. వేరే భాషల్లోకి డబ్‌ చేశారు. కానీ బాహుబలి అలా కాదు.. ఏ భాషకు ఆ భాషలో సినిమాను చిత్రీకరించారు. దీని వల్ల హిందీ వెర్షన్‌ హిందీ సినిమా లాగే ఉంటుంది. తమిళ వెర్షన్‌ తమిళ సినిమాలాగే ఉంటుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా థియేటర్లలో విడుదల కాబోతోంది బాహుబలి. ఇందులో తెలుగు వెర్షన్‌ మాత్రమే 1800 స్క్రీన్స్‌లో రిలీజవుతుంది. హిందీ వెర్షన్‌ ఓ 1500. మిగతావి తమిళం, మలయాళ వెర్షన్స్‌.