Begin typing your search above and press return to search.

అక్టోబర్ 4న బుల్లితెరపై బాహుబలి

By:  Tupaki Desk   |   29 Sept 2015 7:00 AM IST
అక్టోబర్ 4న బుల్లితెరపై బాహుబలి
X
సౌత్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి.. సిల్వర్ స్క్రీన్ పై ఇంకా రికార్డుల దండయాత్రలు కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా అద్భుతాలు ఆవిష్కరించేందుకు రెడీగా ఉన్నాడు జక్కన్న చెక్కిన బాహుబలి. ఈ మూవీ మలయాళీ వెర్షన్ మరో వారంలో అంటే అక్టోబర్ 4న సాయంత్రం 6గంటలకు ప్రసారం కానుంది. మఝావిల్ మనోరమ టీవీలో ఈ మూవీ ప్రసారాన్ని వీక్షించచ్చు.

ఇప్పటికే తెలుగు, హిందీ వెర్షన్లను కూడా టెలికాస్టింగ్ రైట్స్ విక్రయించేశారు. తెలుగులో మాటీవీ బాహుబలి ప్రసార హక్కులు కొనుగోలు చేయగా.. హిందీలో సోనీ మాక్స్ దక్కించుకుంది. బుల్లితెరపై ప్రసారానికి సరైన టైంకోసం ఎదురుచూస్తున్నాయి ఈ ఛానల్స్. తెలుగులో దసరాకి టెలికాస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుండగా.. హిందీలో కూడా పండుగ సీజన్ లోనే ఏదో ఒకరోజు టెలికాస్ట్ చేయచ్చని అంటున్నారు.

బాహుబలి ప్రసారానికి మాటీవీ - సోనీ మాక్స్ లు ఇంకా డేట్ ఫైనలైజ్ చేయలేదు. అయితే టీఆర్పీ రేటింగ్స్ విషయంలో.. పాత రికార్డులన్నీ బద్దలయిపోతాయనే అంచనాలున్నాయి. దశాబ్దాలుగా థియేటర్లకు రాని వాళ్లను కూడా రప్పించిన బాహుబలిపై అన్ని భాషల్లోనూ ఇదే ఎక్స్‌పెక్టేషన్ ఉండడం విశేషం.