Begin typing your search above and press return to search.
బాహుబలా.. పైరసీ ఎంత పనిచేసింది?
By: Tupaki Desk | 10 July 2015 10:11 PM ISTపైరసీపై సమర శంఖం పూరించింది బాహుబలి టీమ్. మా సినిమాని పైరసీలో చూస్తే దొంగ ఎవరో కనిపెట్టేస్తాం అంటూ హుకుం జారీ చేశారు. అయితే సరిగ్గా ఇదే ఊపులో కేరళలోనూ ఈ ఉద్యమం ఊపందుకుంది. పైరసీ భూతాన్ని నిరోధించాల్సిందిగా అక్కడ ఎగ్జిబిటర్లంతా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె వల్ల కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400 థియేటర్లు మూత పడ్డాయి. ఆ ప్రభావం నేడు రిలీజ్‌కొచ్చిన బాహుబలిపై దారుణంగా పడింది. నిజానికి బాహుబలి చిత్రాన్ని 200 థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించినా ఈ స్ట్రయిక్ వల్ల అనుకున్న స్థాయిలో రిలీజ్ చేయలేకపోయారు. దీనివల్ల కలెక్షన్లలో బోలెడంత నష్టం వాటిల్లుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కేరళ ఫిలిం ఫెడరేషన్ కోచ్చిలో సమావేశానికి రెడీ అవుతోంది. అక్కడ ఏ నిర్ణయమూ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ లోగానే బాహుబలికి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబలికి ఈ బంద్ పెద్ద శాపంగా మారిపోయింది. లేదంటే మలయాళంలోనూ రికార్డులు తిరగరాసేదే.