Begin typing your search above and press return to search.
గ్రాఫిక్స్ లో ఇంత మాయ చేసారా?
By: Tupaki Desk | 30 July 2015 9:48 AM ISTబాహుబలి సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. 450 కోట్ల నుంచి 500 కోట్ల వసూళ్ల దిశగా సాగిపోతూనే ఉందీ సినిమా. ఈ సంచలనాల నేపథ్యంలో జక్కన్న పార్ట్ 2 కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఈ లోగానే బాహుబలికి సంబంధించిన మేకింగ్ వీడియోల్ని విడుదల చేస్తూ సినిమాకి మరింత హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. జైత్ర యాత్రకు బ్రేక్ పడకుండా ముందుకు సాగిస్తున్నారు.
లేటెస్టుగా దీవరా.. సాంగ్ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సినిమాకే హైలైట్. మేకింగ్ పరంగా అసాధారణమైన ఫీట్స్ వేశారు. సాంకేతికంగా అత్యున్నతంగా ఈ పాటని తీర్చిదిద్దడానికి రాజమౌళి అండ్ టీమ్ ఎంతగా శ్రమించిందో ఇదిగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎత్తయిన కొండల మీద నుంచి దుమికి వచ్చే జలపాతం ముందు కొన్ని షాట్స్ తెరకెక్కించడానికి రోప్ లను కూడా ఉపయోగించారు. బ్లూమాట్, గ్రీన్ మాట్ ఫార్మాట్ లో సన్నివేశాల్ని చిత్రీకరించి ఆ తర్వాత విఎఫ్ ఎక్స్ లో బ్యాక్ గ్రౌండ్ సీనరీస్ ని కలిపి అద్భుతాల్ని సృష్టించారు గ్రాఫిక్స్ నిపుణులు.
గ్రాఫిక్స్ లో ప్రభాస్ జంప్ లన్నిటినీ కావాల్సిన విధంగా మలుచుకోవడానికి చాలానే తంటాలు పడ్డారనిపిస్తుంది. సినిమా చూసి ఏం ఉంది? అని దీర్ఘాలు తీసినంత కాదు మేకింగ్ అని ఇప్పుడర్థమవుతుంది. మీరు కూడా ఈ వీడియో చూశాక ఆ మాటే చెబుతారు.