Begin typing your search above and press return to search.

చరణ్, అఖిల్‌ లకు సైడిచ్చిన బాహుబలి..

By:  Tupaki Desk   |   29 Sept 2015 11:00 PM IST
చరణ్, అఖిల్‌ లకు సైడిచ్చిన బాహుబలి..
X
థియేటర్లకి - రికార్డులకు దుమ్ము - బూజులు దులిపేసిన బాహుబలి.. టెలివిజన్ లోనూ టీఆర్పీ రికార్డులు బద్దలు కొట్టేందుకు వచ్చేస్తోంది. అక్టోబర్ 25 సాయంత్రం 6 గంటలకు బాహుబలిని ప్రదర్శించబోతున్నట్లు మాటీవీ ప్రకటించింది. దీనికి ముందు ఓ 15 రోజుల నుంచి రాజమౌళి పక్షోత్సవాల రేంజ్ లో నిర్వహిస్తోంది కూడా. వరుసగా జక్కన్న సినిమాలు వేసి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటారన్న మాట.

ఐడియా బాగానే ఉంది కానీ., ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. అక్టోబర్ 16న బ్రూస్ లీ ది ఫైటర్ అంటూ రామ్ చరణ్ థియేటర్లలో వస్తున్నాడు. ఆ రోజున కానీ, ఆ తర్వాత రోజున కానీ.. ఒక్క జక్కన్న మూవీ కూడా టీవీల్లో కనిపించదు. అలాగే అక్టోబర్ 22న అఖిల్ అంటూ అక్కినేని వారసుడు అఖిల్ కూడా వచ్చేస్తున్నాడు. ఇక్కడా సేం సీన్. అక్టోబర్ 22న కానీ - 23న కానీ.. రాజమౌళి మూవీస్ ప్రదర్శనకి బ్రేక్ వేసింది ఛానల్. అంటే.. ఉద్దేశ్యపూర్వకంగానే పెద్ద చిత్రాలకు సైడ్ ఇచ్చినట్లు అర్ధం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో హిట్ సినిమాలు టీవీల్లో వస్తే.. ఆ ప్రభావం కలెక్షన్లపై ఉంటుందనే ఉద్దేశ్యంతోనే.. ఇలా డిసైడ్ చేశారన్న మాట.

సినిమాలను కాపాడ్డానికి.. మాటీవీ ఇలా షెడ్యూల్ చేయడం ఎంతైనా అభినందిచదగ్గ విషయం. కానీ.. పెద్ద సినిమాలకు మాత్రమే ఇలా చేయడం తగదనే విషయం గుర్తుంచుకోవాలి, ఫ్రైడే బ్లాక్ బస్టర్ అంటూ.. అనేక చిత్రాలను శుక్రవారం రాత్రి టెలికాస్ట్ చేస్తున్నారు. అప్పుడు చిన్న సినిమాలకు గట్టిగానే దెబ్బ పడుతోంది. ఈ విషయం కూడా గమనించండి ఛానల్ ఓనర్లూ.