Begin typing your search above and press return to search.

డల్లాస్‌లో బాహుబలి ప్రకంపనలు

By:  Tupaki Desk   |   9 July 2015 7:07 AM GMT
డల్లాస్‌లో బాహుబలి ప్రకంపనలు
X
బాహుబలి సృష్టిస్తున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు రెండు వేల థియేటర్లలో సినిమా విడుదల కాబోతోంది. ఓవర్సీస్‌లో కూడా భారీగా స్క్రీన్లు ఇచ్చారు. యుఎస్‌లో అయితే ఓ హాలీవుడ్‌ సినిమాకు ఎంత హంగామా ఉంటుందో మన 'బాహుబలి'కి కూడా అదే స్థాయిలో సందడి కనిపిస్తోంది. అక్కడ దాదాపు 150 స్క్రీన్స్‌లో బాహుబలి వేస్తున్నారు. విడుదల అంత భారీగా ఉండటమే కాదు.. బుకింగ్స్‌ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో టికెట్లకు ఎంత డిమాండ్‌ ఉందో అక్కడా అలాగే ఉంది పరిస్థితి. బాహుబలి టికెట్‌ సంపాదించడం పెద్ద అచీవ్‌మెంట్‌లా చెప్పుకుంటున్నారు.

అమెరికాలోని డల్లాస్‌లో బాహుబలి ప్రకంపనలు సృష్టిస్తోంది. డల్లాస్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి విడుదలకు ముందే 50 వేల టికెట్లు అమ్ముడుబోయాయట. ఇప్పటిదాకా డల్లాస్‌లో మరే తెలుగు సినిమాకు రిలీజ్‌కు ముందే ఇన్ని టికెట్లు తెగలేదట. అంతే కాదు.. అమ్మకానికి పెట్టిన ఒక్క రోజులోనే ఎనిమిది షోలకు సంబంధించిన టికెట్లు అమ్ముడుబోవడం కూడా రికార్డట. యుఎస్‌లోని మిగతా ఏరియాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ విడుదలకు ముందు రోజే ప్రిమియర్‌ షోలు వేస్తున్నాడు. టికెట్‌ ధరలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఉన్నాయి. అయినా అభిమానులు ఏమాత్రం సంకోచించకుండా అంత రేటు పెట్టి టికెట్లు సొంతం చేసుకుంటున్నారు.