Begin typing your search above and press return to search.
బాహుబలి తొలి రోజు 60 కోట్లా
By: Tupaki Desk | 11 July 2015 12:24 PM ISTవామ్మో వాయ్యో.. ఇది కనీవినీ ఎరుగని అద్భుతం. ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ సినిమాకు కూడా సాధ్యం కాని రికార్డుల్ని సృష్టిస్తోంది బాహుబలి. తొలి రోజు టాలీవుడ్ వరకు రికార్డుల మోత మోగుతుందని తెలుసు కానీ.. ఏకంగా బాలీవుడ్ రికార్డుల్ని కూడా 'బాహుబలి' కొల్లగొట్టేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ తొలి రోజు వసూళ్లలో ఇండియాలో నెంబర్‌వన్ స్థానాన్ని బాహుబలి ఆక్రమించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తిగా క్లారిటీ రావడానికి టైం పట్టొచ్చు కానీ.. అన్ని భాషల్లో విడుదలైన అన్ని థియేటర్లలో కలిపి శుక్రవారం ఆఖరు షోతో కలిపి బాహుబలి రూ.60 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు అంచనా. ఇందులో షేర్ రూ.45 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
ఇప్పటిదాకా తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా షారుఖ్ ఖాన్ 'హ్యాపీ న్యూ ఇయర్'దే రికార్డు. ఆ సినిమా రూ.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు బాహుబలి ఆ రికార్డును బద్దలు కొట్టినట్లే కనిపిస్తోంది. ఇండియాలో, ఓవర్సీస్‌లో వేసిన ప్రిమియర్ షోలతో కలుపుకుంటే బాహుబలి రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు అంచనా. ఒక్క యుఎస్‌లోనే ప్రిమియర్ షోల ద్వారా రూ.7.5 కోట్లు వసూలవడం విశేషం. ఇక శుక్రవారం రెగ్యులర్ షోల ద్వారా ఇంకో ఏడున్నర కోట్ల దాకా వచ్చింది. ఇలా మొత్తం ఒక్క యుఎస్‌లోనే రూ.15 కోట్లు వసూలయ్యాయి. ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే తొలి రోజు వసూళ్లు రూ.20 కోట్లు దాటిపోయాయి. తెలుగు వెర్షన్ ఏపీ, నైజాం కలిపి తొలి రోజు రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. హిందీ, తమిళ వెర్షన్స్ కలిపి రూ.15 కోట్ల దాకా వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఇలా మొత్తం కలుపుకుంటే బాహుబలి తొలి రోజు వసూళ్లు రూ.60 కోట్ల మార్కును అందుకున్నాయి. ఈ ఘనత ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమాకు సొంతం కాలేదు. సౌత్ ఇండియా వరకు అయితే లింగ రూ.39 కోట్లతో గత ఏడాది రికార్డు నెలకొల్పింది.