Begin typing your search above and press return to search.

కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   21 July 2015 11:55 AM IST


నోరా పథేహి, స్కార్లెట్‌ విల్సన్‌... వీళ్లంతా ఐటెమ్‌ భామలుగా టాలీవుడ్‌ కి సుపరిచితం. ఈ ముగ్గురూ ఒక్కో సినిమాలో, ఒక్కో పాటలో కనిపించి కనువిందు చేశారే కానీ, ఒకే పాట కోసం కలిసి చిందేసింది లేదు. ఇక వీరితో పాటు మధు స్నేహ అనే మోడల్‌ ను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఓ ఐటెమ్‌ చేయించాడు రాజమౌళి. ఓ రకంగా కన్నుల పండువ చేయించాడు.

బాహుబలి చిత్రంలో మనోహరి అంటూ సాగే ప్రత్యేక గీతంలో ఈ భామలు నర్తించారు. ఒంపుసొంపులు వయ్యారాల్ని వడ్డించారు. అప్పటివరకూ సీరియస్‌ గా నడుస్తున్న డ్రామా లో ఇదో రిలాక్సేషన్‌. ముఖ్యంగా కుర్ర కారుకి ఈ ముగ్గురు భామలు బోలెడంత కనువిందు చేశారు. ఇప్పటికే యూత్‌ ఈ చిత్రాన్ని రెండు మూడు సార్లు థియేటర్ల లో వీక్షిస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలకు మ్యాచింగ్‌ గా ఈ రొమాంటిక్‌ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. అయితే ఇంతకాలం థియేటర్‌ లోనే ఈ పాటని వీక్షించాల్సొచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్‌ యాప్‌ లోనూ ఈ పాటను చూడొచ్చు. ఇప్పటికే యూట్యూబ్‌ లో రిలీజైంది. లహరి ఆడియో, టి-సిరీస్‌ సంయుక్తంగా ఈ వీడియో ని రిలీజ్‌ చేశాయి.

ఇంతకుముందు టీజర్‌ లో ఓ చిన్న బిట్‌ చూపించి ఆవేశాన్ని రగిలించిన ప్రచారకర్తలు వ్యూహం మార్చి ఇప్పుడు పూర్తి పాటను నెట్‌ లో వదిలారు! ఈ భామల్ని పెద్ద తెరపై మరోసారి చూసుకోవాలనే ఉత్సాహంతో టీనేజర్‌ లు థియేటర్లకు రాకపోతారా? అని ఆశ కాబోలు.