Begin typing your search above and press return to search.

ఖలేజా ఉంటే ఖాన్స్‌కు కూడా ఇత్తడే

By:  Tupaki Desk   |   12 July 2015 5:00 PM IST
ఖలేజా ఉంటే ఖాన్స్‌కు కూడా ఇత్తడే
X
బా..హు..బ..లి... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మంత్రాన్నే అందరూ జపిస్తున్నారు. ఈ ఆదివారం సంగతి పక్కనెట్టేయండి.. వచ్చే ఆదివారం షోలకు కూడా టిక్కెట్లు లేవు. ఇప్పుడే మొత్తం సీనంతా ఖాళీ అయిపోయింది. ఎక్కడా టిక్కెట్లు దొరకట్లేదు. అయితే ఇదంతా కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనేనా? అబ్బే లేదు. నార్త్‌లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా మనోళ్లకు ఏమాత్రం కునుకుపట్టనీయకుండా సినిమా ఆడేస్తోంది.

నిజానికి బాహుబలి సినిమా ఒక్క విషయాన్ని ప్రూవ్‌ చేసింది. ఒక్క స్టార్‌ లేడు.. ఒక్క స్టార్‌ హీరోయిన్‌ లేదు.. హిందీలో ప్రవేశమున్న నటులు లేరు ఒక్క మిల్కీ తప్పించి.. హిందీ సినిమాలు తీసిన అనుభవం రాజమౌళికి లేదు.. అయినా సరే కంటెంట్‌లో దమ్ముంటే అది ఖాన్స్‌ సినిమాలకంటే కత్తిలాగా ఆడుతుందని బాహుబలి వసూళ్ళే చెబుతున్నాయి. తొలిరోజు ఇండియా నెట్‌ కలెక్షన్లు 42.1 కోట్లతో ''హ్యాపీ న్యూ ఇయర్‌'' సినిమాను బీట్‌ చేసిందంటే.. బాహుబలి సత్తా ఏంటో తెలిసింది.

ఇంకా ఏం ప్రూవ్‌ చేసిందంటే.. ఒక సినిమాలో షారూఖ్‌, సల్మాన్‌, అమీర్‌ వంటి ఖాన్స్‌ ఉంటేనే కాదు, కంటెంట్‌ ఉంటే ఎవరి సినిమా అయినా కూడా ఇరగదీస్తుందని ప్రూవ్‌ చేశాడు రాజమౌళి. ఖాన్‌లకు కంచు కోటగా ఉన్న బాలీవుడ్‌లో తన జెండాను ఎగరేశాడంటే అది మామూలు విషయం కాదు మరి. తెలుగోడి సత్తా అనే కాదు, యావత్‌ సినిమా ఈక్వేషన్స్‌నే రీ రైట్‌ చేసేశాడు జక్కన్న.