Begin typing your search above and press return to search.

దుర్గాపూజ..మాహిష్మతి మండపం!

By:  Tupaki Desk   |   17 Oct 2018 6:08 AM GMT
దుర్గాపూజ..మాహిష్మతి మండపం!
X
SS రాజమౌళి సృష్టించిన మాయలోకం మాహిష్మతి కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉంటాడా? బాహుబలి సినిమాలోని లోటుపాట్లు గురించి మాట్లాడేవారు చాలామందే ఉన్నారుగానీ మాహిష్మతి ఊహకు.. దాన్నివెండితెరమీదకు తెచ్చిన రాజమౌళి కి మాత్రం వాళ్ళు కూడా సాహో అనే అంటారు. అందుకే సినిమా రిలీజ్ అయిన వారానికే ఆ సినిమా గురించి మర్చిపోయే మన జనాలు బాహుబలి-2 విడుదలై ఏడాదిన్నర దాటినా ఇంకా దాన్ని మాయలోనే ఉన్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సౌత్ లో ఉండే మనకు దసరా చాలా ముఖ్యమైన పండగే గానీ బెంగాల్.. ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో దుర్గా పూజ అనేది మనం ఇచ్చే పాధాన్యత కంటే మరింత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి చోట ఒక మండపం దుర్గా మాత విగ్రహం పెట్టి మనం గణేష్ పండగ చేసే స్టైల్ లోనే చేస్తారు. అలా త్రిపుర లోని అగర్తలా లో బాహుబలి మండపం ఒకటి తయారు చేయడంతో అదిప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది. మాహిష్మతి కోట లాగే మండపం రెడీ చేసి అందులో దుర్గా మాత విగ్రహాన్ని పెట్టారు. కోట మాత్రమే కాదండోయ్.. అక్కడ భారీ సైజు బొమ్మ ఏనుగులు కూడా పెట్టారు.

మీరు సడెన్ గా ఫోటో చూస్తే రామోజీ ఫిలిం సిటీ లోని మాహిష్మతి సెట్ కదా ఇది అని అనుకుంటారేమో. ఈ మండపం ఆర్గనైజర్స్ అయిన నేతాజీ ప్లే ఫోరం సెంటర్ వారు ఈ మాహిష్మతి సెట్ ఎందుకు వేయాల్సి వచ్చిందో కూడా తెలిపారు. దుర్గామాత పూజకు బాహుబలి సెట్ వేయాలని లోకల్ రాజకీయ నాయకులు .. ప్రజలు డిమాండ్ చేశారట..!