Begin typing your search above and press return to search.

బాబుగారితో బాహుబలి అందాలు

By:  Tupaki Desk   |   15 Sept 2017 9:49 PM IST
బాబుగారితో బాహుబలి అందాలు
X
ఒకప్పుడు తన సినిమాలతో భారీ వసూళ్ళను రాబట్టి కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు సినిమాలను చాలా వరకు తగ్గించేశాడు. తనకు నచ్చిన కథలుంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. చివరగా అల్లరి నరేష్ 50వ చిత్రమైన మామా మంచు అల్లుడు కంచు అనే సినిమాలో కనిపించిన మోహన్ బాబు ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాను ఓకే చేయలేదు. ఆఫర్లు వచ్చినా చేయనని చెప్పారట. కానీ చాలా రోజుల తర్వాత ఆయన మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఓ చిత్రంతో రాబోతున్నాడు.

ఆ నలుగురు వంటి మంచి కథలను అందించి పలు సినిమాలకు దర్శకత్వం వహించిన మదన్ దర్శకత్వంలో 'గాయత్రి' అనే సినిమాను తీస్తున్నాడు మోహన్ బాబు. రాజాకీయ నేపధ్యంలో ఉండే ఈ కథ వినగానే మోహన్ బాబు ఒకే చేశారట. అనసూయ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఆమెది జర్నలిస్ట్ పాత్ర అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే సినిమాలో కథను మలుపు తిప్పే ఓ సన్నివేశంలో వచ్చే సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలవనుందట. అందుకోసం చిత్ర యూనిట్ బాహుబలి భామలను ఎంచుకున్నారట.

బాహుబలి మొదటి పార్ట్ లో స్కార్లెట్‌ విల్సన్‌.. మధు స్నేహ.. నోరా ఫతేలి కలసి ఒక ఐటెమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఇప్పుడు స్కార్లెట్.. మధు స్నేహ గాయత్రి లో చిందులేశారట. రీసెంట్ గా తిరుపతిలో వేసిన భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. స్కార్లెట్‌ విల్సన్ ఇంతకుముందు కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా అమ్మడు హాట్ గర్ల్ గా చేసిన సంగతి తెలిసిందే.