Begin typing your search above and press return to search.
సౌత్‌లో కిరీటం బాహుబలిదే!!!
By: Tupaki Desk | 11 July 2015 10:25 PM ISTబాహుబలి ప్రభంజనం తొలిరోజు భీకరంగా సాగింది. ఈ సినిమా రిలీజైన అన్నిచోట్లా రికార్డుల పర్వం కొనసాగిస్తోంది. ఇంటా బైటా వసూళ్ల మోత మోగిస్తోంది. బాహుబలి తొలిరోజు 40కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఔరా అనిపించింది. ఈ సందర్భంగా అసలు ఇండియాలో రిలీజైన దక్షిణాది చిత్రాల్లో టాప్-5 చిత్రాలేవీ అన్న లెక్కలు తీస్తే ఒక మంచి విషయం తెలిసింది.
నిన్నటివరకూ దక్షిణాదిన తొలిరోజు గ్రాస్ వసూళ్లలో టాప్-1 సినిమాగా లింగా పేరు వినిపించింది. తెలుగు, తమిళ్ రెండుచోట్లా వసూళ్లు కలుపుకుని లింగా రికార్డ్ 22కోట్లు. సూపర్‌స్టార్ రజనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే ఇది సాధ్యమైంది. నిన్నటితో ఆ రికార్డును తుడిచేస్తే దాదాపు రూ.40కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి 'బాహుబలి' సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. ఇక మూడో స్థానంలో శంకర్ దర్శకత్వం వహించిన 'ఐ' చిత్రం నిలిచింది. ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండుచోట్లా వసూళ్లు కలుపుకుని రూ.20.8కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో రోబో నిలిచింది. తెలుగు, తమిళ్, హిందీ మూడు చోట్లా కలుపుకుని రోబో 18కోట్లు వసూలు చేసింది. పవన్ నటించిన అత్తారింటికి దారేది ఇండియా మొత్తం మీద తొలిరోజు 16కోట్లు వసూలు చేసి ఐదో స్థానంలో నిలిచింది.
ఇకపోతే బాహుబలి ఇలా టాప్‌లో రావడం అనేది తెలుగు వారందరికీ ఎంతో గర్వమైన విషయం. రాజమౌళి రేంజ్ ఈ దెబ్బతో ఎక్కడికో వెళిపోయిందనే చెప్పాలి. అయినాసరే మనోడు ఎంతో విధేయంగ ఈ క్రెడిట్ ప్రేక్షకులదే అంటున్నారు.