Begin typing your search above and press return to search.
కొత్త మార్కెట్ ఓపెన్ చేసిన బాహుబలి
By: Tupaki Desk | 13 Aug 2015 7:22 PM ISTబాహుబలి అసాధారణ విజయం ఎన్నిటినో మార్చేసింది. తెలుగు సినిమా స్టామినా పెంచి అంతర్జాతీయ మార్కెట్ లో గిరాకీ పెరిగేలా చేసింది. ఇంతకాలం అసలు తెలుగు సినిమా అంటే ఒక ప్రాంతానికే చెందినది అన్న భావన తుడిచిపెట్టుకుపోయిందిప్పుడు. ఇకనుంచి యూనివర్శల్ అప్పీల్ ఉన్న సినిమాలు తీసేందుకు ఊతం ఇచ్చింది.
అంతేకాదు, బాహుబలి విజయం వల్ల ఆ తర్వాత రిలీజైన శ్రీమంతుడుకి బిజినెస్ పెరిగింది. వాస్తవానికి బాహుబలి కంటే ముందే ఈ సినిమా రిలీజై ఉంటే మార్కెట్ రేంజ్ 60కోట్లు లోపే ఉండేది. కానీ ఆ తర్వాత రిలీజవ్వడం ఈ సినిమాకి కలిసొచ్చింది. ఓవర్సీస్ వ్యాపారులు సహా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ పోటీపడి మరీ మార్కెట్ ని పెంచారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ఇంతకుముందు మగధీర, అత్తారింటికి దారేది చిత్రాల పేరిట ఉన్న రికార్డుల్ని కొట్టేసింది. ఇదంతా మన మంచికే. ఇకముందు రిలీజయ్యే ప్రతి సినిమాని కొనేందుకు కార్పొరెట్ పోటీపడబోతోంది. అంతార్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బడా సంస్థలు ఈరోస్ ఇంటర్నేషనల్, యూటీవీ మోషన్ పిక్చర్స్, రిలయన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వంటి సంస్థలు పోటీపడి తెలుగు సినిమా మార్కెట్ ని పెంచేందుకు రెడీ అవుతున్నాయి.
ఈ పరిణామం, పవన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు కలిసొచ్చేదే. మిగతా హీరోలకు మార్కెట్ పెరుగుతుంది. ఇక నుంచి సినిమా తీస్తే కేవలం తెలుగు మార్కెట్ నే కాదు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ని ఎంపిక చేసుకుంటారు. ఇదో కొత్త పరిణామం. అంతా మన మంచికే.