Begin typing your search above and press return to search.
బాహుబలి.. అందరూ వచ్చేసినట్లేనా?
By: Tupaki Desk | 20 July 2015 1:03 PM ISTబాహుబలి రెండు భాగాలు కలిపైనా 300 కోట్లు వసూలు చేస్తుందా అని అనుమానించారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు బాహుబలి.. ది బిగినింగ్ గ్రాస్ వసూళ్లే 300 కోట్లు దాటిపోయాయి. ప్రతి ఏరియాకు రికార్డు స్థాయిలో థియేట్రికల్ రైట్స్ తీసుకుంటుంటే.. అందరూ రిస్క్ చేస్తున్నట్లే అనిపించింది. కానీ ఇప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటరూ భారీగా లాభాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. విడుదలైన పది రోజులకే మెజారిటీ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ దాటిసినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాకు రికార్డు స్థాయిలో రూ.22.5 కోట్లు పెట్టి రైట్స్ తీసుకున్న దిల్ రాజు 9వ రోజు పెట్టుబడి రాబట్టేసుకున్నాడు. ఇవి షేర్ వసూళ్లే కావడంతో ఆదివారమే రాజుకు లాభాల పంట మొదలైంది. ఇక బాహుబలిని థియేటర్ల నుంచి తీసేసే దాకా రాబట్టే ప్రతి పైసా (షేర్) రాజు జేబులోకి వెళ్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే ముందు లాభాల్లోకి వచ్చింది సీడెడ్ (రాయలసీమ) ఏరియానే. రూ.11 కోట్లకు రైట్స్ అమ్మితే తొలి వారానికే షేర్ ఆ మొత్తాన్ని దాటిపోయింది. ఆదివారానికి మూణ్నాలుగు కోట్ల లాభంలో ఉన్నాడు డిస్ట్రిబ్యూటర్. ఐతే ఆంధ్రా ప్రాంతంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లందరూ లాభాల్లోకి రాలేదు. అక్కడ ఉత్తరాంధ్ర మినహా ఏకమొత్తంగా కాకుండా జిల్లా జిల్లాకు రైట్స్ అమ్మారు. సీడెడ్, నైజాం ఏరియాలతో పోలిస్తే ఇక్కడ అమ్మకాలు మరింత భారీగా జరిగాయి. నెల్లూరు (రూ.3.5 కోట్లు), కృష్ణా (రూ.5 కోట్లు), తూర్పు గోదావరి (రూ.5 కోట్లు), పశ్చిమ గోదావరి (రూ.4.5 కోట్లు), గుంటూరు (రూ.6.5 కోట్లు).. ఈ ఏరియాలు దాదాపుగా బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసినట్లే. ఐతే ఇంకా లాభాలు మాత్రం రాలేదు. కర్ణాటక, ఓవర్సీస్ ఏరియాల్లో మాత్రం తెలుగు వెర్షన్ బిజినెస్ జరిగిందానితో పోలిస్తే రెట్టింపు వసూళ్లు రావడం విశేషం.