Begin typing your search above and press return to search.

ఊ ఊ ఊ.. నాకు బాహుబలి కావాలి

By:  Tupaki Desk   |   1 Oct 2015 4:00 AM IST
ఊ ఊ ఊ.. నాకు బాహుబలి కావాలి
X
జక్కన్న చిత్రీకరించిన కళాఖండం బాహుబలి. ఈ మూవీ ఎంతో మందిని ఆకట్టుకుంది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా.. ప్రతీ ఒక్కరికీ విజువల్ ట్రీట్ ఇచ్చింది. తెలుగుతెరపై ఇంతటి అద్భుతం ఇప్పటివరకూ రాలేదనే ప్రశంసలు కూడా అందుకుంది. అయితే.. ఓ బుజ్జాయిని మాత్రం.. మన బాహుబలి విపరీతంగా కట్టిపడేసింది. నిజమే.. ఆ చిన్నారిని టీవీ ముందు కట్టేశాడు బాహుబలి.

విజయవాడకు చెందిన విజయచంద్రిక అనే చిన్నారి.. ప్రభాస్ వాళ్లింటికొస్తేనే స్కూల్ కి వెళతానని పట్టుపట్టింది. మూడో తరగతి చదువుతున్న ఈ పాప.. ఇప్పటివరకూ 50 సార్లు చూసేసిందట బాహుబలిని. స్కూల్ కి వెళ్లాలన్నా, అన్నం తినాలన్నా, మారాం చేసినా.. ఏం చేసినా బాహుబలి మూవీని ప్రదర్శించడం ఒకటే దారి. ఇంట్లోనే టీవీలో బాహుబలి చూసుకుంటూ.. డైలాగులన్నీ బట్టీపట్టి చెప్పేస్తోంది. ఎమోషన్స్ కూడా పండించేస్తూ.. విజయ చంద్రిక చెబ్తున్న డైలాగ్స్ వింటుంటే భలే ముచ్చటగా ఉంది. కానీ.. స్కూల్ కి వెళ్లాలంటే మాత్రం బాహుబలిని చూశాకే అంటోంది.

కనీసం ప్రభాస్ దగ్గరకయినా తనని తీసుకెళ్లమంటోంది. మరి ఈ బుల్లి అభిమాని కోరికని.. బాహుబలి తీరుస్తాడో లేదో... ఏదేమైనా అసలు పిల్లలకు అలా పైరసీ ప్రింటును ఇచ్చినందుకు ఆ తల్లిదండ్రులపై యాక్షన్‌ తీసుకోవాలంటారా??