Begin typing your search above and press return to search.
సెప్టెంబర్ 15 నుంచి ఎండింగ్ మొదలు
By: Tupaki Desk | 23 July 2015 7:22 PM ISTఅమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవుల విరోచిత పోరాటాన్ని క్లయిమాక్స్‌లో చూసి మైమరిచిపోయాం. ఆ దృశ్యాలు ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోక ముందే మరో శుభవార్తను చెప్పేశాడు ప్రభాస్. ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఉన్న ప్రభాస్ సైలెన్స్ కి చెక్ పెడుతూ బాహుబలి పార్ట్ 2.. అదేనండి ఎండింగ్ పార్టు.. ఎప్పుడు మొదలవుతుందో చెప్పేశాడు.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నా. అందరూ హ్యాపీ మూడ్ లో ఉన్నాం. తొలి భాగం సక్సెస్ ని ఆస్వాధిస్తూనే రెండో భాగం గురించి కలగంటున్నాం. సెప్టెంబర్ 15 నుంచి షూటింగ్ మొదలైపోతోంది.. అంటూ చెప్పేశాడు. బాహుబలి : ది బిగినింగ్ లో అసలు అమరేంద్ర బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచి చంపేయడానికి కారణమేంటో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారు. ఇక అక్కడినుంచి కథ మొదలవుతుంది. ఆ సస్పెన్స్ కి చిక్కుముడి వీడుతుంది. తండ్రిని చంపించిన వారిపై శివుడు పగ తీర్చుకోవడానికి బయల్దేరతాడు.
అయితే కథలో ట్విస్ట్ ప్రకారం అప్పటివరకూ మంచిగా, బాహుబలి సపోర్టర్ గా కనిపించిన శివగామి అసలైన విలన్ గా అవతరించబోతోందని అర్థమవుతోంది. అంటే శివుడు శివగామిని, భళ్లాలదేవుని ఎదురించి మాహిష్మతి సామ్రాజ్యాన్ని తిరిగి తన చేతిలోకి వశపరుచుకోవడమే ఈ సినిమా అని అనుకోవాలి. గెట్ రెడీ ఫర్ బాహుబలి: ది కంక్లూజన్.