Begin typing your search above and press return to search.

ఆ వాయిస్‌లే మ్యాజిక్‌ చేశాయా?

By:  Tupaki Desk   |   12 July 2015 5:07 PM IST
ఆ వాయిస్‌లే మ్యాజిక్‌ చేశాయా?
X
మామూలుగా మొదటిరోజు ఒక సినిమా కలెక్షన్లు ఎంత వస్తాయో.. రెండో రోజు అయితే దానికంటే తక్కువ రావాలి లేకపోతే అంతే రావాలి. పెద్దపెద్ద బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు కూడా ఈ రోజుల్లో తొలి రోజు వచ్చినంత రెండో రోజు రావట్లేదు. అటువంటిది ఒక సినిమా టాక్‌ బయటకు వచ్చేశా ఇక రెండో రోజు కలెక్షన్లు పెరిగే ఛాన్సుందా? బాహుబలి మాత్రం దీన్ని ప్రూవ్‌ చేసిందోచ్‌.

బాలీవుడ్‌లో హిందీ వర్షెన్‌ బాహుబలి ఇప్పుడు ఓ కొత్త ఫీట్‌ చేసింది. తొలిరోజున 5.1 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన బాహుబలి అక్కడ రెండో రోజున ఏకంగా 40% హైక్‌తో 7 కోట్లు వసూలు చేసింది. డబ్బింగ్‌ సినిమాల చరిత్రలో ఇదో రికార్డు అక్కడ. అయితే అంతగా బాలీవుడ్‌ను మ్యాజిక్‌ చేసిన విషయాలేంటి? ఓవరాల్‌ ఒక జోదా అక్బర్‌ రేంజులో నార్త్‌ ఆడియన్స్‌కు సినిమా నచ్చేయడం ఒక విషయమైతే.. ఇక డబ్బింగ్‌ ఒకటి ఇరగదీసింది.

మన దగ్గర ప్రభాస్‌, రానా వాయిస్‌లు కాస్త ఫ్లాట్‌గా అనిపించవచ్చు. ఎందుకంటే ఇద్దరిదీ గంభీరమైన బేస్‌ వాయిస్‌ మాత్రం కాదు. కాని బాలీవుడ్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ బేస్‌ వాయిస్‌ ఉన్న డబ్బింగ్‌ ఆర్టిస్టులతో వీళ్ళగా గాత్రధారణ చేయించాడు కరణ్‌ జోహార్‌. దానితో అక్కడ సినిమా బాగా పేలిందని ఒక టాక్‌. వాయిస్‌ మ్యాజిక్‌తోనే బాహుబలి సినిమా రక్తికట్టిస్తుందని ట్రేండ్‌పండితులు కూడా నమ్ముతున్నారు.