Begin typing your search above and press return to search.

బాహుబలి బెనిఫిట్‌ షోలతోనే కోట్లు!

By:  Tupaki Desk   |   8 July 2015 1:00 PM IST
బాహుబలి బెనిఫిట్‌ షోలతోనే కోట్లు!
X
మళ్లీ ఇలాంటి సినిమా ఇంకోసారి వస్తుందో రాదో.. ఇంత క్రేజ్‌ మళ్లీ ఉంటుందో లేదో.. అందుకే బాహుబలి క్రేజ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబలి బెనిఫిట్‌ షోలు ఓ రేంజిలో ప్లాన్‌ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్‌ వరకే దాదాపు 15 థియేటర్లలో అర్ధరాత్రి నుంచి షోలు పడబోతున్నాయి. ప్రస్తుతానికి భ్రమరాంభ, మల్లికార్జున, శివపార్వతి, విశ్వనాథ్‌, హైటెక్‌, శ్రీరాములు థియేటర్లలో బెనిఫిట్‌ షోలు కన్ఫమ్‌ అయ్యాయి. ఈ థియేటర్లలో అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల మధ్య బెనిఫిట్‌ షోలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి, సుదర్శన్‌ థియేటర్లలో ముందు రోజు రాత్రి 9-10 గంటల మధ్యే బెనిఫిట్‌ షోలు వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఇంకా కొన్ని థియేటర్లలో బెనిఫిట్‌ షోలు పడబోతున్నాయి. వీటికి టికెట్ల ధరలు రూ.2 వేలు, రూ.1500, రూ.1000 చొప్పున ఉన్నాయి. ఒక్కో షోకు రూ.10 లక్షల టార్గెట్‌తో షోలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన హైదరాబాద్‌లోనే బెనిఫిట్‌ షోల కలెక్షన్లు కోటి మార్కును దాటేస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా నగరాల్లో.. పట్టణాల్లో కూడా ఫ్యాన్స్‌ కోసం స్పెషల్‌ షోలు ఏర్పాటు చేస్తున్నారు. చాలా చోట్ల అర్ధరాత్రి షోలు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతి చోటా క్రేజ్‌ పీక్స్‌లో ఉండటంతో.. ఆ క్రేజ్‌ను సొమ్ము చేసుకోవడానికి సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేస్తున్నారు. భారీగా ధరలు పెడుతున్నారు. ఈ లెక్కన మొత్తం బెనిఫిట్‌ షోల కలెక్షన్లే కొన్ని కోట్లు ఉండబోతున్నాయి.