Begin typing your search above and press return to search.
బాహుబలికే నేషనల్ అవార్డ్
By: Tupaki Desk | 28 March 2016 12:09 PM ISTఎన్నో ఏళ్ళు గడిచిపోయాయ్.. అసలు 'బెస్ట్ రీజనల్ సినిమా' అనిపించుకోవడమే తప్పించి.. బెస్ట్ సినిమా అని మనం ఎప్పుడు అనిపించుకుంటాం? మన సినిమాకు ఎప్పుడు 'ఉత్తమ చిత్రం' అవార్డు దక్కుతుంది? నేషనల్ లెవెల్ లో మన తెలుగు సినిమా జెండాను ఎప్పుడు మళ్లీ ఆవిష్కరించుకుంటాం?
ఆ సమయం రానే వచ్చింది. రాజమౌళి చెక్కిన మహాద్భుత ''బాహుబలి'' సినిమాను 63వ నేషనల్ అవార్డుల కమిటీ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసింది. గతంలో విజువల్ ఎఫెక్ట్స్ కు గాను 'ఈగ' టీమ్ నేషనల్ అవార్డును అందుకున్న తరువాత.. బహుశా ''బాహుబలి''తో ఉత్తమ చిత్రం అవార్డును అందుకోవడం చాలా గొప్ప విషయమే. రాజమౌళీ టీమ్ అంతా ఎన్నో ఏళ్ళు శ్రమ పడి అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సినిమాకు అవార్డు దక్కడం యావత్ తెలుగు ప్రేక్షకులకే కాదు.. భారతీయ సినిమా అభిమానులందరికీ గర్వకారణం.
ఇకపోతే ''పీకూ'' సినిమాలోని అద్భుత నటకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు ఉత్తమ నటుడు అవార్డు రాగా.. ''తనూ వెడ్స్ మనూ రిటర్న్స్ '' సినిమాలోని ఉత్తమ నట ప్రదర్శనకు.. కంగనా రనౌత్ కు ఉత్తమ నటి అవార్డు వరించింది. బెస్ట్ డైరక్టర్ అవార్డును ''బాజీరావ్ మస్తానీ'' సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దక్కించుకున్నాడు.