Begin typing your search above and press return to search.
బాహుబలి గ్రాఫిక్స్ గొప్పగా లేనట్లేనా?
By: Tupaki Desk | 26 Feb 2016 7:28 PM ISTసాధారణంగా ప్రతిష్టాత్మక అవార్డుల విషయంలో ఫ్యాంటసీ, హారర్, ఫిక్షన్ సినిమాలను అంతగా పట్టించుకోరు. నామినేషన్లు, అవార్డుల విషయంలో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కి ఉన్న ప్రాధాన్యత.. ఇలాంటి ఫిక్షన్ చిత్రాలకు ఉండదు. కానీ ప్రఖ్యాత శాటర్న్ అవార్డులు మాత్రం ఇలాంటి సినిమాలకు మాత్రమే ప్రత్యేకం. ఫిక్షన్ - ఫ్యాంటసీ - హారర్ సినిమాలకు ప్రత్యేకమైన శాటర్న్ అవార్డ్స్.. 2016కు సంబంధించి నామినేషన్లను ప్రకటించింది.
ఇందులో బాహుబలికి ఐదు నామినేషన్లు లభించడం చెప్పుకోదగ్గ విషయం ఉత్తమ ఫ్యాంటసీ ఫిలిం - ఉత్తమ సహాయ నటి(తమన్నా) - ఉత్తమ ఫిలిం ప్రొడక్షన్ డిజైన్(సాబుసిరిల్) - ఉత్తమ ఫిలిం మ్యూజిక్(ఎంఎం కీరవాణి) - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్(రమా రాజమౌళి) లకు నామినేషన్ లభించింది. కానీ,.. బాహుబలిని బెస్ట్ వీఎఫ్ ఎక్స్ కేటగిరీలో మాత్రం ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యకరం. అయితే.. బాహుబలి ది బిగినింగ్ లో ఉన్న వీఎఫ్ ఎక్స్ షాట్స్ మనకు కొత్తగా మెస్మరైజ్ చేస్తాయి కానీ.. ఈ అవార్డుల విషయంలో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది.
స్టార్ వార్స్-ది ఫోర్స్ అవేకెన్స్, మ్యాడ్ మ్యాక్స్-ఫ్యూరీ రోడ్ వంటి చిత్రాలతో పోల్చితే.. బాహుబలిలోని గ్రాఫిక్స్ అంతగా ఆకట్టుకోవన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఏమైతేనేం.. ప్రతిష్టాత్మక అవార్డుల్లో మన సినిమాని 5 కేటగిరీల్లో ఎంపిక చేయడం మాత్రం సంతోషించాల్సిన విషయమే.