Begin typing your search above and press return to search.

రెండు సూపర్ సీక్వెల్స్ కి ముహూర్తం నేడే

By:  Tupaki Desk   |   16 Dec 2015 4:04 AM GMT
రెండు సూపర్ సీక్వెల్స్ కి ముహూర్తం నేడే
X
మొదటి భాగంతో యావత్ భారతదేశాన్ని మెప్పించిన రెండు భారీ చిత్రాలు ఈరోజు నుండే తమ రెండో భాగం షూటింగ్ ని ప్రారంభించడం యాద్రుచికమో - దైవ నిర్ణయమో.. రోబోతో సౌత్ స్టామినా ని నిరువుపించిన శంకర్ - బాహుబలి తో తెలుగు ఖ్యాతిని లోకానికి చాటిన రాజమౌళి తమ సినిమాలకు సీక్వెల్స్ ని ఈరోజు నుండే ప్రారంభించనున్నారు.

బాహుబలి 2 ఈరోజే ముహుర్తమని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సినిమా షూటింగ్ లాంచనంగా ఈరోజు ప్రారంభమైనా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి జరగనుంది. ఇప్పటికే రెండో భాగంలో 40 శాతం షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని మైమరిపించే రీతిలో పార్ట్ 2 ని తెరకెక్కిస్తామని జక్కన్న బృందం తెలిపింది.

ఇక రోబో తో విజువల్ వండర్ సృష్టించిన శంకర్ నేడు రోబో 2.0 ని మొదలుపెట్టనున్నాడు. స్టోరీ సిట్టింగ్స్ - మేక్ అప్ టెస్ట్ లు - లొకేషన్ స్కౌట్ లు పూర్తవడంతో ఈరోజు నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని శంకర్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. ఈ రెండో వెర్షన్ లో రజినీ సరసన అమీ జాక్సన్ కనువిందు చేయనుంది.