Begin typing your search above and press return to search.

బాహుబ‌లి మేనియా ఏ రేంజిలో ఉందంటే..

By:  Tupaki Desk   |   23 Oct 2016 3:54 AM GMT
బాహుబ‌లి మేనియా ఏ రేంజిలో ఉందంటే..
X
‘బాహుబ‌లిః ది బిగినింగ్’ మొద‌ల‌య్యే స‌మ‌యానికి అది కేవ‌లం తెలుగు సినిమా మాత్ర‌మే. కానీ ‘బాహుబ‌లిః ది కంక్లూజ‌న్’ మాత్ర అలా కాదు. మొత్తం దేశ‌మంతా ఈ సినిమా కోసం అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. సౌత్ నార్త్.. ఈస్ట్ వెస్ట్ అన్న తేడాలేమీ లేవు. బ‌హుశా ఇండియాలో ఇప్ప‌టిదాకా మ‌రే సినిమాకూ ఇంత అంచ‌నాలు లేవంటే అతిశ‌యోక్తి కాదు. ‘బాహుబ‌లి’కి సంబంధించి ఈ చిన్న స‌మాచార‌మైనా స‌రే.. సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్కే. అంద‌రిలోనూ విప‌రీత‌మైన ఆస‌క్తే. ఈ నెల ఆరంభంలో ‘బాహుబ‌లిః ది కంక్లూజ‌న్ లోగోను లాంచ్ చేస్తే సోష‌ల్ మీడియా షేకైపోయింది.

ఈ రోజు బాహుబ‌లిః-2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ విష‌యంలోనూ అంతే ఆస‌క్తి క‌నిపించింది. ఈ రోజు ఉద‌యం నుంచి ‘బాహుబ‌లి2ఫ‌స్ట్ లుక్’ అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ టాప్ లో ట్రెండ్ అయింది. ఇక ఫ‌స్ట్ లుక్ బ‌య‌టికి రావ‌డం ఆల‌స్యం చ‌ర్చ‌ల‌న్నీ దాని గురించి.. ఇండియా లెవెల్లో ఈ హ్యాష్ ట్యాగే టాప్ లో ట్రెండ్ అవుతూ ఉంది. బెంగ‌ళూరు.. చెన్నై.. దిల్లీ.. ఇండోర్.. ఇలా లొకేష‌న్ ఏది పెట్టినా బాహుబ‌లి2ఫ‌స్ట్ లుక్ అనే హ్యాష్ ట్యాగే అగ్ర‌భాగాన క‌నిపిస్తోంది. ఇక ముంబ‌యిలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌రుగుతున్న ఆడిటోరియంలో మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన‌పుడు రెస్పాన్స్ చూస్తే.. ఈ సినిమా మీద ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో సైతం ఎంత ఆస‌క్తి ఉందో అర్థ‌మ‌వుతుంది. పోస్ట‌ర్ లాంచ్ కాగానే మొత్తం ఆడిటోరియంలో ఉన్న‌వాళ్లంద‌రూ స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చి బాహుబ‌లి బృందాన్ని గౌర‌వించడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/