Begin typing your search above and press return to search.

బాహుబలి-2 ట్రైలర్ రివ్యూ వచ్చేసింది

By:  Tupaki Desk   |   8 March 2017 6:46 AM GMT
బాహుబలి-2 ట్రైలర్ రివ్యూ వచ్చేసింది
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ ఇంకా బయటికి రాలేదు. అప్పుడే ట్రైలర్ రివ్యూ ఏంటి అంటారా? ఈ రివ్యూ ఇచ్చింది ‘బాహుబలి’ బృందానికి చాలా దగ్గరివాడైన వ్యక్తిలెండి. కీరవాణి తమ్ముడు.. ‘బాహుబలి’కి సాంకేతిక సహకారం కూడా అందిస్తూ వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ రమణ.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ చూసేశాడట. వెంటనే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ట్విట్టర్లో ఒక మెసేజ్ కూడా పెట్టేశాడు. ‘‘బాహుబలి-2 ట్రైలర్ చూశా. గుండెలు అదిరిపోయినయ్. సినిమా కాదు.. కేవలం ఈ ట్రైలరే వంద రోజులు ఆడుతుంది. నా మాటలు గుర్తు పెట్టుకోండి. ట్రైలర్ త్వరలోనే రిలీజవుతుంది’’ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు కళ్యాణ రమణ.

అసలే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ కోసం జనాలు తహతహలాడిపోతున్నారు. దాని మీద భారీ అంచనాలతో ఉన్నారు. ఇప్పుడిక కళ్యాణరమణ గుండెలు అదిరిపోయాయని.. ట్రైలరే వంద రోజులు ఆడేస్తుందని అంటే ఇక ‘బాహుబలి’ ప్రియులు ఆగడం కష్టమే. ఫస్ట్ పార్ట్ విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్ సినిమాపై అప్పటికే ఉన్న అంచనాల్ని అమాంతం పెంచేసింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ‘బాహుబలి-2’ కోసం భారీ అంచనాలతో ఉన్న సమయంలో రానున్న ఈ ట్రైలర్ ఇంకెంతగా ప్రకంపనలు రేపుతుందో చూడాలి. మార్చి 15న ‘బాహుబలి-2’ ట్రైలర్ రాబోతున్న సంగతి తెలిసిందే.