Begin typing your search above and press return to search.

బాహుబలి-2 ట్రైలర్ ఎప్పుడో తెలిసిపోయింది

By:  Tupaki Desk   |   6 March 2017 12:45 PM GMT
బాహుబలి-2 ట్రైలర్ ఎప్పుడో తెలిసిపోయింది
X
భారతీయ సినీ చరిత్రలోనే ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద ఉన్నంత అంచనాలు మరే సినిమాకూ లేవంటే అతిశయోక్తి ఏమీ లేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రతి సినీ ప్రేక్షకుూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఇంకో యాభై రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతకంటే ముందు ట్రైలర్ రుచి చూపించబోతున్నాడు రాజమౌళి.

ఈ నెల 15న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ రిలీజవబోతున్నట్లు తాజా సమాచారం. ఆల్రెడీ మార్చి మధ్యలో ట్రైలర్ వస్తుందని రాజమౌళి ప్రకటించాడు. కాకపోతే ఇంకా వీఎఫెక్స్ స్టూడియో నుంచి కంటెంట్ రాని నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ డేట్ ఎప్పుడో చెప్పలేనన్నాడు. ఐతే ఇప్పుడు కంటెంట్ చేతికొచ్చిందో ఏమో.. ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్లుంది.

‘బాహుబలి: ది బిగినింగ్’ ట్రైలర్ రెండేళ్ల కిందట ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడానికి ఆ ట్రైలరే కారణం. ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’పై ఇప్పటికే ఉన్న భారీ అంచనాల్ని ట్రైలర్ మరింతగా పెంచుతుందేమో చూడాలి. ట్రైలర్ రిలీజయ్యాక ఓ రెండు వారాల వ్యవధిలో ఆడియో వేడుకను భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/