Begin typing your search above and press return to search.
బాహుబలి2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్
By: Tupaki Desk | 2 March 2016 1:00 PM ISTఈ యేడాది వస్తుందా రాదా అనే కొశ్చెన్ మార్క్ అవసరం లేదిక. బాహుబలి 2 రిలీజ్ డేట్ అధికారికంగా కన్ఫర్మ్ అయినట్టే. ఆ చిత్రం వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదలవుతోంది. బాలీవుడ్ వర్గాలు ఆ విషయాన్ని తేల్చి చెప్పాయి. ఇటీవల రాజమౌళి మాట్లాడుతూ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ యేడాదే విడుదలవుతుందని లేదంటే మాత్రం వచ్చే యేడాదే అని చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి సినిమా అంటే గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉంటుంది, పైగా ఇప్పుడు తీస్తున్నది సంచలనాలు సృష్టించిన బాహుబలికి సీక్వెల్. అంటే ఇందులో తొలి చిత్రం కంటే ఎక్కువగా గ్రాఫిక్స్ ఉండే అవకాశాలున్నాయి. ఆ విషయాలన్నిటినీ దృస్టిలో ఉంచుకొని బాహుబలి 2 అంత త్వరగా వచ్చే అవకాశం లేదని ప్రేక్షకులు ఫిక్సయ్యారు. అనుకున్నట్టుగానే బాహుబలి 2 వచ్చే యేడాది వస్తున్నట్టు స్పష్టమైంది.
అయితే ఉన్నట్టుండి ఇప్పుడు రిలీజ్ డేట్ రావడానికి కూడా ఓ కారణం ఉంది. మామూలుగా తెలుగులో అయితే ముందస్తు రిలీజ్ డేట్ అవసరం లేదు. అదే బాలీవుడ్‌లో మాత్రం కొబ్బరికాయ కొట్టినరోజునే రిలీజ్ డేట్ చెప్పాల్సి వుంటుంది. ఆమేరకు డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు ప్రిపేర్ కావల్సి ఉంటుంది. అలా బాలీవుడ్ వర్గాల ఒత్తిడిచేయడంతోనే బాహుబలి 2 రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందని తెలుస్తోంది. బాహుబలిని రిలీజ్ చేసిన కరణ్ జోహారే బాహుబలి 2ని హిందీలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.