Begin typing your search above and press return to search.

ముంబై తర్వాత.. బెంగళూరులో బాహుబలి

By:  Tupaki Desk   |   12 Nov 2016 11:30 AM GMT
ముంబై తర్వాత.. బెంగళూరులో బాహుబలి
X
బాహుబలి2 ప్రమోషన్స్ కోసం ఏ యాంగిల్ ని వదిలిపెట్టడం లేదు జక్కన్న అండ్ టీం. ఖర్చు పెట్టి మీడియాలో పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేకుండానే.. ప్రతీ అప్ డేట్ ని ఎక్స్ క్లూజివ్ అంటూ ఛానళ్లు.. వెబ్ సైట్లు ప్రచారం చేసేస్తున్నాయి. స్పెషల్ ఈవెంట్స్ లో ఏదో ఒక హంగామా చేస్తూ.. బాహుబలి సీక్వెల్ కి మరింతగా హైప్ తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం బెంగళూరులో కామిక్ కాన్ అనే ఈవెంట్ జరుగుతోంది. పాప్ కల్చర్ పై ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో కూడా బాహుబలి సందడి చేస్తోంది. స్పెషల్ గా ఓ 'వీఆర్' బూత్ ను ఏర్పాటు చేశారు. తాము రూపొందించిన స్వార్డ్ ఆఫ్ బాహుబలి టీజర్ ను చూడమని పిలుస్తున్నారు కూడా. బాగానే ఉంది కానీ.. టీజర్ కు సంబంధించిన బూత్ ను బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఫస్ట్ లుక్ ఈవెంట్ ని ముంబైలో నిర్వహించారు. మరి తెలుగు ఆడియన్స్ కు ఏం చూపిస్తారు అనే డౌట్ రావడం సహజం.

ఇక్కడ మీడియా జనాలకు ఈ టీజర్ వేసి చూపించారంతే. కామన్ పీపుల్ కి అందుబాటులోకి తేలేదు. ఈ టీజర్ పబ్లిక్ అందరికీ అందుబాటులోకి వచ్చేది వచ్చే ఏడాదే అని హైద్రాబాద్ లో ఓ అనౌన్స్ మెంట్ చేశారంతే. పక్క రాష్ట్రాల ప్రజలపై ఉన్నంత ప్రేమ.. బాహుబలి టీంకి తెలుగు రాష్ట్రాల జనాలపై ఎందుకు లేదో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/