Begin typing your search above and press return to search.

బాహుబలి 2 పోస్టర్: ప్రభాస్-అనుష్క కేక

By:  Tupaki Desk   |   26 Jan 2017 6:54 AM GMT
బాహుబలి 2 పోస్టర్: ప్రభాస్-అనుష్క కేక
X
బాహుబలి సిరీస్ లో రెండోది చివరిది అయిన బాహుబలి: ది కంక్లూజన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ను ముందుగానే అనౌన్స్ చేయగా.. విడుదలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. సాధారణ చిత్రాలకైతే ఇది ఎక్కువే కానీ.. పూర్తిగా గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ బాహుబలి2కి ఇది తక్కువ సమయమే. ఇదే టైంలో ప్రమోషన్స్ ను కూడా చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప బాహుబలి2కి వేరే ప్రమోషన్స్ చేయలేదు జక్కన్న అండ్ టీం. అందుకే వచ్చే ప్రతీ సందర్భాన్ని ఇందుకోసం ఉపయోగించుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా.. బాహుబలి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. వీటిలో ఒకటి మాహిష్మతి ఏరియల్ వ్యూ అయితే.. మరొకటి ప్రభాస్-అనుష్కలు విల్లంబులతో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో. ఒకేసారి మూడు బాణాలను విల్లులో అమర్చి.. బాణాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది ఫోటో.

ఇవి అమరేంద్ర బాహుబలి.. దేవసేన పాత్రలు అని ప్రత్యేకించి ఆడియన్స్ కు చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఈ పోస్టర్ లో అటు ప్రభాస్ ఇటు అనుష్కల లుక్ మాత్రం అదిరిపోయింది. పూర్తి దేహ ధారుడ్యంతో ప్రభాస్.. నాజూకు నడుముతో కనిపిస్తున్న అనుష్కల ఫోటో.. అందరినీ ఆకట్టుకుంటోంది. రిపబ్లిక్ డేకి బాహుబలి టీం ఇచ్చిన ట్రీట్ సూపర్ అనాల్సిందే.