Begin typing your search above and press return to search.

ప్లాన్డ్ గా ప్రభాస్ తో తప్పు చేయించాడా

By:  Tupaki Desk   |   2 May 2017 1:17 PM GMT
ప్లాన్డ్ గా ప్రభాస్ తో తప్పు చేయించాడా
X
ప్రభాస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ఫిలిం ఇండస్ట్రీలలోను హాట్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి సిరీస్ తో హింది లో గ్రాండ్ ఎంట్రీ దొరికింది. బాహుబలికి ఉన్న క్రేజ్ తో మొత్తం సౌత్ ఇండియా అన్నీ భాషలలో విడుదల చేశారు. దీంతో ప్రభాస్ నెక్ట్స్ మూవీపై జనాల ఫోకస్ బాగానే పెరిగింది. బాహుబలి క్రేజ్ ను తమ సినిమాకు వాడేద్దాం అని ఫిక్స్ అయిన సుజిత్.. ప్రభాస్ మరుసటి చిత్రం సాహో టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేసేశాడు.

సాహో టీజర్ విడుదలైంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగు-హిందీ-తమిళ్-మలయాళ వెర్షన్లకు కలిపి కోటికి పైగా వ్యూస్ వచ్చేయడం చూసి.. నిర్మాతలు కూడా షాక్ తినేశారనే చెప్పాలి. అయితే.. ఇన్ని వ్యూస్ వచ్చినా.. సాహో గురించి మాట్లాడుతున్న వారు ఎవరూ లేరు. అందరూ బాహుబలి2 చేస్తున్న మహామాయలోనే మునిగి తేలుతున్నారు తప్ప.. సాహో గురించి పెద్దగా మాట్లాడుకోవటం లేదు.

వినిపిస్తున్న ఒకటి అరా కామెంట్స్ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. సాహో టీజర్ బాలేదని.. పర్లేదని అనేవాళ్లే తప్ప.. సూపర్ అనే వాళ్లు ఒక్కళ్లు కూడా కనిపించడం లేదు. బాహుబలి ఎఫెక్ట్ తో ప్రభాస్ తర్వాతి సినిమా అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. అలాంటి అంచనాలు ఉన్నపుడు.. యావరేజ్ కంటెంట్ తో కొట్టుకు రావడం కష్టమైన పనే. బాహుబలి2కి ముందే సాహో టీజర్ ఇద్దామని దర్శక నిర్మాతలు వేసిన ప్లాన్.. అంతగా వర్కవుట్ అవలేదని.. పైగా బెడిసికొట్టిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/