Begin typing your search above and press return to search.

బాహుబ‌లి 2 కూడా లీకైందా?

By:  Tupaki Desk   |   22 Nov 2016 3:42 AM GMT
బాహుబ‌లి 2 కూడా లీకైందా?
X
మ‌రోసారి టాలీవుడ్‌ లో లీకుల క‌ల‌క‌లం మొద‌లైంది. బాహుబ‌లి 2లోని రెండున్నర నిమిషాల వార్ ఎపిసోడ్ లీకైన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఆన్‌ లైన్‌ లో ఆ స‌న్నివేశాల్ని చూసిన చిత్ర‌బృందం ఒక్కసారిగా విస్తుపోయింద‌ట‌. వెంట‌నే రంగంలోకి దిగి న‌ష్ట‌నివార‌ణ చ‌ర్యలు చేప‌ట్టింది. ఆన్‌ లైన్‌ లో లీకైన స‌న్నివేశాల్ని తొల‌గించి సైబ‌ర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్‌ తో పాటు - అనుష్క గెట‌ప్పులు - కొన్ని వార్ స‌న్నివేశాలు లీకైన క్లిప్‌ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అప్ప‌ట్లో బాహుబ‌లి ది బిగినింగ్‌ లోని కొన్ని స‌న్నివేశాలు కూడా ఇలాగే లీక‌య్యాయి. అప్పుడు కూడా ఇలాగే చిత్ర‌బృందం ఆన్‌ లైన్‌ లో స‌న్నివేశాల్ని తొల‌గించి పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. గ్రాఫిక్స్ బృందంలోని ఒక‌రు ఆ స‌న్నివేశాల్ని లీక్ చేసిన‌ట్టు తెలుసుకున్న పోలీసులు ఆయ‌న‌పై చ‌ర్చ‌లు తీసుకొన్నారు. మ‌రి ఈసారి లీకువీరులెవ‌ర‌నేది చూడాలి. బాహుబ‌లి ది కన్‌ క్లూజ‌న్ ఓ సంచ‌ల‌న చిత్రం. ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఈ ద‌శ‌లో సినిమా లీకైతే ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండ‌దు. అందుకే చిత్ర‌బృందం క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ లీకువీరులు సినిమాని వదిలిపెట్ట‌డం లేదు. మ‌రి ఈ విష‌యంపై చిత్ర‌బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

అయితే లీకైన క్లిప్పుల్లో అనుష్క గెట‌ప్పు భ‌లే ఉంద‌ని ఆన్‌ లైన్‌ లో జ‌నాలు మాట్లాడుకొంటున్నారు. కొద్దిమంది మాత్రం ఇది ప‌బ్లిసిటీ స్టంట్ అంటున్నారు. అయినా బాహుబ‌లి సినిమాకి అద‌నంగా ప‌బ్లిసిటీ కావాలా? ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా గురించి ఎదురు చూస్తుంటే ఇప్పుడు పబ్లిసిటీ కోసం చిత్ర‌బృందం పాకులాడుతుందా? కామెడీ కాక‌పోతే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/