Begin typing your search above and press return to search.

బాహుబలి2 లీక్.. పబ్లిసిటీ స్టంట్!?

By:  Tupaki Desk   |   24 Nov 2016 10:58 PM GMT
బాహుబలి2 లీక్.. పబ్లిసిటీ స్టంట్!?
X
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని లీకులు పట్టి పీడిస్తున్నాయనే విషయం వాస్తవమే. కొన్ని బాలీవుడ్ సినిమాలకు కోలుకోలేని దెబ్బ కూడా తగిలింది. టాలీవుడ్ లో కూడా లీకుల గోల ఎక్కువగానే ఉంటోంది. రిలీజ్ కి ముందే సినిమాకు సంబంధించిన ఫుటేజ్ నెట్ లో ప్రత్యక్షం కావడం కనిపిస్తోంది. రీసెంట్ గా బాహుబలి2కి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ లో కొంత భాగం ఇంటర్నెట్ లో దర్శనమివ్వగా.. పోలీసులు నిందితుడిని విజయవాడలో పట్టుకున్నారు.

కొన్ని సార్లు ఆయా ఫిలిం మేకర్స్ తమ సినిమాలను లీక్ చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. దీని ద్వారా విపరీతమైన పబ్లిసిటీ పొందారన్నది ఇండస్ట్రీ జనాల వాదన. పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది లీక్ అయినప్పుడు.. మొత్తం ఇండస్ట్రీ అంతా స్పందించినా.. ఆ తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కనీసం ఎవరినీ దోషులుగా కూడా తేల్చలేదు. చాలా కేసుల్లో ఆయా సినిమాలకు పని చేసే టెక్నికల్ స్టాఫ్ దోషులుగా తేలినా.. ఆ తర్వాత తేలిగ్గానే తప్పించుకుంటున్నారు.

కొన్ని టాలీవుడ్ సినిమాలు లీక్ తర్వాత సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాహుబలి మొదటి భాగంలో కొన్ని నిమిషాల ఎపిసోడ్ లీకయింది. నాయక్ మూవీకి సంబంధించి ఓ పాట అంతా బయటకు వచ్చింది. అత్తారింటికి దారేది అయితే.. సినిమా మొత్తం లీక్ అయింది. ఇప్పుడు అన్నీ రఫ్ షాట్స్ తప్ప.. ఒక్క ఫ్రేమ్ కూడా ఫైనల్ షాట్ లేని బాహుబలి2 కూడా అంతే అనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/