Begin typing your search above and press return to search.

బాహుబలి 2 ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   20 Aug 2016 10:44 AM GMT
బాహుబలి 2 ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్
X
ప్రమోషన్స్ విషయంలో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి స్టైలే వేరు. సినిమాలో కంటెంట్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో.. ఆ సినిమా చేసే పబ్లిసిటీ అంతకంటే పవర్ ఫుల్ గా ఉంటుంది. సినిమా సినిమాకి స్టైల్ మార్చి మరీ ప్రమోషన్స్ చేస్తుంటాడు జక్కన్న. బాహుబలి ఫస్ట్ పార్ట్ కి ఒక్కో కేరక్టర్ న ఇంట్రడ్యూస్ చేస్తూ.. ప్రచారం చేసిన తీరు ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు రెండో భాగానికి కూడా సేమ్ స్టైల్ అప్లై చేయనున్నాడు రాజమౌళి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజుతో బాహుబలి2 కి పబ్లిసిటీ కార్యకలాపాలను ప్రారంభించనున్నాడు రాజమౌళి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. బాహుబలి2కి ఫస్ట్ లుక్ ఇవ్వడంతో పాటే.. ప్రభాస్ నటించిన సన్నివేశాల క్లిప్పింగ్స్ తో ఓ వీడియో కూడా రిలీజ్ చేయనున్నారని టాక్. ఎక్కవగా మేకింగ్ షాట్స్ ఉన్న.. బాహుబలి ది కంక్లూజన్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయని అంటున్నారు.

గతంలో కూడా ఆయా యాక్టర్ల పుట్టిన రోజులకు ఇలా కేరక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలు అందించగా.. ఇప్పుడు కూడా అదే రూట్ ఫాలో కానున్నాడు జక్కన్న. ప్రభాస్ బర్త్ డే నాడు ఇచ్చే ఫస్ట్ లుక్ తో మొదలుపెట్టినా.. రిలీజ్ వరకూ ఈ హంగామా కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఉన్నాయని టాక్.