Begin typing your search above and press return to search.

ప్రభాస్-పవన్ డిష్యుం డిష్యుం

By:  Tupaki Desk   |   12 March 2017 7:48 AM GMT
ప్రభాస్-పవన్ డిష్యుం డిష్యుం
X
ఒకప్పుడు ఒక సినిమా ఎన్ని సెంటర్లలో వంద రోజులాడిందన్నదాన్ని బట్టి ఒక హీరో స్టామినాను అంచనా వేసేవాళ్లు. ఆ తర్వాత కలెక్షన్లు ప్రామాణికం అయ్యాయి. ఐతే ఇప్పడు కలెక్షన్ల కంటే ముందు యూట్యూబ్‌ లో వ్యూస్ ను బట్టి హీరో సత్తాను అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాల యూట్యూబ్ రికార్డులు తరచుగా బద్దలవుతున్నాయి. ఖైదీ నెంబర్ 150.. కాటమరాయుడు.. దువ్వాడ జగన్నాథం టీజర్లు యూట్యూబ్ లో మోత మోగించాయి.

ఐతే ఇప్పుడు వాటన్నింటినీ మించిన విశేషం యూట్యూబ్ లోకి రాబోతోంది. ఇంకో నాలుగు రోజుల్లో.. అంటే మార్చి 16న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడ్ ట్రైలర్ల యూట్యూబ్ రికార్డులు మాత్రమే కాదు.. మొత్తంగా ఇండియన్ సినిమా ట్రైలర్ల రికార్డులన్నీ బద్దలుకావడం ఖాయమని అంచనా.

‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ మోత మోగించాక.. రెండు రోజుల వ్యవధిలోనే మరో థండర్ ట్రైలర్ యూట్యూబ్ లోకి రాబోతోంది. అదే కాటమరాయుడు ట్రైలర్. ఈ నెల 18న ‘కాటమరాయుడు’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ట్రైలర్ విడుదల చేస్తారు. టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే కాబట్టి.. ట్రైలర్ కూడా యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ‘బాహుబలి’ని కొట్టడం కష్టమే కానీ.. దానికి దీటుగా.. నాన్-బాహుబలి రికార్డుల్ని తిరగరాస్తూ పవన్ ట్రైలర్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ప్రభాస్ ట్రైలర్ ఎన్ని వ్యూస్ తెచ్చుకుంటుందో.. పవన్ ట్రైలర్ ఎలాంటి మోత మోగిస్తుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/