Begin typing your search above and press return to search.

సినిమా ప్రమోషన్ కోసం చీప్ పబ్లిసిటీ షురూ

By:  Tupaki Desk   |   4 Jan 2018 2:32 PM GMT
సినిమా ప్రమోషన్ కోసం చీప్ పబ్లిసిటీ షురూ
X
బాలీవుడ్లో ఏదైనా కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతోందంటే.. అందులోని తారలకు సంబంధించి ఏదో ఒక వివాదమో.. ఒక కొత్త గాసిప్పో ప్రచారంలోకి వస్తుంది. కంగనా రనౌత్ తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఒక వివాదాస్పద అంశాన్ని పట్టుకుని మీడియా ముందుకు వస్తుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందు అందులోని హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తాయి. ఇప్పుడు టైగర్ ష్రాఫ్-దిశా పటాని జోడీ గురించి కూడా ఇలాంటి గాసిప్పే బయటికి వచ్చింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట సీక్రెట్‌ గా పెళ్లి చేసేసుకుందంటూ ఒక ప్రచారం మొదలైంది బాలీవుడ్లో. ఐతే వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న ‘బాగి-2’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో స్ట్రాటజిగ్గా ఈ రూమర్ ప్రచారంలోకి తెచ్చారేమో అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

టైగర్-దిశా జోడీ ప్రేమాయణం రహస్యమేమీ కాదు. వాళ్ల ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారంతోనే ఉన్నట్లున్నాయి. ఇద్దరూ బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇంకా కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న వీళ్లిద్దరూ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అలాంటపుడు ఉన్నట్లుండి ఇప్పుడే రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి అవసరం ఏముంది..? దీన్ని బట్టి చూస్తుంటే ప్రమోషన్ కోసం ఈ పెళ్లి రూమర్ తీసుకొచ్చారని అంటున్నారు. పబ్లిసిటీ కోసం బాలీవుడ్ జనాలు ఇంకా ఎంతగానో దిగజారిన సందర్భాలు చాలానే ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని లైట్ తీసుకోవచ్చు. ఇక ‘బాగి-2’ విషయానికి వస్తే.. తెలుగు సూపర్ హిట్ మూవీ ‘వర్షం’కు రీమేక్ గా తెరకెక్కిన ‘బాగి’కి ఇది సీక్వెల్. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతునున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదలవుతుంది.