Begin typing your search above and press return to search.

మహేష్ గురించి రెండు అప్ డేట్లు

By:  Tupaki Desk   |   8 July 2017 11:12 AM IST
మహేష్ గురించి రెండు అప్ డేట్లు
X
స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలంటే ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల సినిమాలంటే ఆసక్తి మరీ ఎక్కువ. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కోసం చూస్తుంటారు. మహేష్ ప్రస్తుతం ఒకటికి రెండు సినిమాలతో ప్రయాణం సాగిస్తున్నాడు. ‘స్పైడర్’ ముగింపు దశలో ఉండగా.. ‘భరత్ అను నేను’ ఈ మధ్యనే మొదలైంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి రెండు కొత్త అప్ డేట్స్ వచ్చాయి.

కొరటాల దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘భరత్ అను నేను’ కొత్త షెడ్యూల్ ఈ నెల 13న మొదలవుతుందట. తొలి షెడ్యూల్లో మహేష్ పాల్గొన్న సన్నివేశాలు చాలా తక్కువ. మహేష్ లేకుండానే వేరే నటీనటులతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన కొరటాల.. ఈ మధ్యే మహేష్ జాయినయ్యాక కొన్ని సీన్స్ తీశాడు. ఇప్పుడు 13న మొదలయ్యే షెడ్యూల్లో మహేష్ పూర్తి స్థాయిలో షూటింగ్ లో పాల్గొంటాడట.

మరోవైపు ‘స్పైడర్’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు-రకుల్ ప్రీత్ మీద శోభి మాస్టర్ నేతృత్వంలో మురుగదాస్ పాట చిత్రీకరిస్తున్నాడట. ‘స్పైడర్’కు సంబంధించి ఇంకో పాటను కూడా చిత్రీకరించాల్సి ఉందట. ఆ పాట అవ్వగానే దాదాపు సినిమా అంతా పూర్తయినట్లే. ఈ చిత్రాన్ని పక్కాగా దసరాకు విడుదల చేస్తారట. సెప్టెంబరు 27న సినిమా ప్రేక్షకుల్ని పలకరించే అవకాశముంది.