Begin typing your search above and press return to search.

ఆ సెంటిమెంటును నమ్ముకున్న బొమ్మరిల్లు భాస్కర్

By:  Tupaki Desk   |   3 Feb 2020 5:28 AM GMT
ఆ సెంటిమెంటును నమ్ముకున్న బొమ్మరిల్లు భాస్కర్
X
సెంటిమెంట్లు చాలామందికి ఉంటాయి కానీ ఫెయిల్యూర్లు మన తిత్తి తీస్తూ ఉన్నప్పుడే సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతాం. హీరోలు.. ఫిలిం మేకర్లు అందుకు మినహాయింపేమీ కాదు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా తన కొత్త సినిమా కోసం ఇప్పుడు ఒక సెంటిమెంట్ ను నమ్ముకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

'బొమ్మరిల్లు' సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు భాస్కర్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇక భాస్కర్ కెరీర్ కు తిరుగుండదని చాలామంది అనుకున్నారు. అయితే 'పరుగు' లాంటి ఒకటి అరా సినిమాలు తప్ప మిగతావన్నీ నిరాశపరచడంతో ఫేడ్ అవుట్ అయ్యాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో అఖిల్ అక్కినేని హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విజయం ఇటు భాస్కర్ కెరీర్ .. అటు అఖిల్ భవిష్యత్తుకూ కీలకం. అందుకే ఎటువంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదట. విజయం కోసం తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నాడట.

ఈ సినిమాకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి కదా. చూస్తుంటే ఈ టైటిల్ వరల్డ్ ఫేమస్ లవర్ సౌండింగ్ లో ఉందని కూడా కొన్ని కామెంట్లు వినిపించాయి.. అది కూడా నిజమే కానీ ఇందులో 'బ్యాచిలర్' అనేది మెయిన్ టైటిల్.. మోస్ట్ ఎలిజిబుల్ అనేది క్యాప్షన్ లాగా (ప్రిఫిక్స్) లాగా చిన్న అక్షరాలతో ఉంటుంది. అంటే మహేష్ ఖలేజా.. కళ్యాణ్ రామ్ కత్తి లాంటి టైటిల్ అనుకోవచ్చు. దర్శకుడు భాస్కర్ కు 'బొమ్మరిల్లు' కెరీర్ బెస్ట్ ఫిలిం. ఆ సినిమా టైటిల్ బ అక్షరం తో ప్రారంభమైంది కాబట్టి ఈ సినిమాకూ బ సెంటిమెంట్ తో బ్యాచిలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. మరి ఈ బ సెంటిమెంటు భాస్కర్... అఖిల్ బాబులకు భారీ హిట్టు తీసుకొచ్చి ఫ్లాపుల బాధ నుంచి విముక్తి కలిగిస్తుందో లేదో వేచి చూడాలి.