Begin typing your search above and press return to search.
సీనియర్ భామకి బీ గ్రేడ్ నిర్మాతల షాక్
By: Tupaki Desk | 3 March 2016 9:38 AM ISTఓ హీరోయిన్ చాలాకాలం పాటు బాగా పద్ధతిగా కనిపించి, కేరక్టర్ డిమాండ్ చేసిందనో పరిస్థితులు తేడా చేశాయనో ఓ సినిమాలో ఎక్స్ పోజింగ్ చేస్తే.. ఇక అలాంటి ఆఫర్లే క్యూ కట్టడం ఖాయం. ఇప్పుడు చెన్నై బ్యూటీ త్రిష పరిస్థితి ఇలాగే ఉంది. పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా స్కిన్ షోకి మాత్రం దూరంగానే ఉండిపోయింది ఈ బ్యూటీ. కానీ రీసెంట్ గా రూట్ మార్చినట్లు కనిపించడంతో.. వచ్చే ఆఫర్లు కూడా మారిపోయాయి.
కోలీవుడ్ మూవీ అరణ్మణై 2, తెలుగులో కళావతి పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాలో త్రిష ఎప్పుడూ లేనంత గ్లామర్ ఒలకబోసింది. పెళ్లి ఆగిపోవడమో, లేడీ సూపర్ స్టార్ అనిపించుకోవాలని ఆతృత పడుతున్న ఆఫర్లు తగ్గడమో.. కారణం చెప్పలేం కానీ.. బికినీ లాంటి బట్టలేసుకుని బీచ్ సాంగ్ కూడా చేసింది త్రిష. మాజీ లవర్ సిద్ధార్ధ్ తో కలిసి మాంచి రొమాంటిక్ సాంగ్ లో కూడా నటించింది. త్రిషలో ఈ డెవలప్ మెంట్ చూసిన కొందరు బీగ్రేడ్ నిర్మాతలు ఓ ఫిక్సేషన్ కు వచ్చేశారు.
భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే.. అందాలు ఆరబోసే పాత్రల్లో నటిస్తుందనే ఉద్దేశ్యంతో.. త్రిషను అప్రోచ్ అయ్యారట. దీంతో అమ్మడికి మంట నషాళానికి అంటి.. మేనేజర్ పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. బీగ్రేడ్ సినిమాలే కాదు.. స్టార్ హీరోల మూవీస్ లో ఆఫర్ అయినా సరే.. స్కిన్ షో చేసేది లేదని, అలాంటివాటిని నా దగ్గరకు తేనక్కర్లేదని తేల్చేసిందట త్రిష.