Begin typing your search above and press return to search.

'ఆర్జీవీ' పై మూత్రం పోసినట్లు 'B.కామ్ లో ఫిజిక్స్' ఫస్ట్ లుక్...!

By:  Tupaki Desk   |   23 July 2020 8:50 AM GMT
ఆర్జీవీ పై మూత్రం పోసినట్లు B.కామ్ లో ఫిజిక్స్ ఫస్ట్ లుక్...!
X
'ఏడుచేప‌ల క‌థ' ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ ''B.కామ్ లో ఫిజిక్స్''. టాలీవుడ్ లో విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేసే శ్యామ్ జే చైత‌న్య ఇంతకముందు 'ఏడుచేప‌ల క‌థ' అనే సినిమాతో పాటు 'ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి' అనే చిత్రం తెరకెక్కించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 'బి.కామ్‌ లో ఫిజిక్స్' అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే క్యాచీ డైలాగ్ ని సినిమాకి టైటిల్ గా పెట్టేసారు శ్యామ్. ఇప్పటికే 80 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కూడా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై తెలుగుతో పాటు సేమ్ టైటిల్ తో హిందీలో కూడా నిర్మిస్తున్నారు. అంకిత రాజ్‌ పుత్‌, య‌శ్వంత్, సునీల్‌, మేఘ‌నా చౌద‌రి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కాగా తాజాగా 'B.కామ్ లో ఫిజిక్స్' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. టైటిల్ కి తగ్గట్లు గానే ఫస్ట్ లుక్ ని కూడా అదే రీతిన మేకర్స్ రెడీ చేసారు. మూత్రశాలలోని గోడపై 'రాకేష్ మాస్టర్' - 'ఆర్జీవీ' - 'పేటియం కత్తి మహేష్' - 'కేఏ పాల్' - 'కరణ్ జోహార్' - 'టెంప్ట్ రవి లవ్ యూ' అనే నేమ్స్ రాసి ఉన్నట్లు పోస్టర్ డిజైన్ చేసారు. అంతేకాకుండా ఓ అమ్మాయి హార్ట్ సింబల్ మధ్యలో ఉన్న 'ఆర్జీవీ' పేరుపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపించారు. మొత్తం మీద 'B.కామ్ లో ఫిజిక్స్' చిత్రం కూడా బోల్డ్ గా ఉండబోతోందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఆడియన్స్ కి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా ఈ సినిమాని రెడీ చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి ఏకె రిషాల్ సాయి సంగీతం సమకూర్చగా ఆర్లి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి క‌థ‌ మాట‌లు స్క్రీన్‌ ప్లే అందించిన శ్యామ్ జే చైత‌న్య‌ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు.