Begin typing your search above and press return to search.

ఆ రీమేక్ డైరెక్ట్ చేసే దమ్మున్న డైరెక్టర్..ఇంకా తేలలేదా?

By:  Tupaki Desk   |   18 April 2020 9:30 AM GMT
ఆ రీమేక్ డైరెక్ట్ చేసే దమ్మున్న డైరెక్టర్..ఇంకా తేలలేదా?
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం రీమేక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తుండటంతో ఈ రెండూ కలిసి ఉన్న సినిమా చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు. మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాను రీమేక్ చేయడం కోసం నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యింది. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానాని ఓకే చేశారు. ఇక మరో కీలక పాత్రకోసం బాలకృష్ణను తీసుకోవాలనుకున్న వార్తలు పుకార్లు అని తెలిసింది. అయితే బిజూ మీనన్ పాత్రకోసం రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నారట నిర్మాతలు.

ఇదిలా ఉండగా ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే విషయం ఇంకా తేలలేదు. కానీ నిర్మాతలు ఇద్దరు డైరెక్టర్ల పేర్లు పరిశీలిస్తున్నారట. ఒకరు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరిని అనుకుంటున్నారట. కానీ గౌతమ్ ప్రస్తుతం జెర్సీని హిందీలో తెరకెక్కించాడానికి స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడట. మరొకరు సుధీర్ వర్మ. అయితే సుధీర్ కూడా హిట్లు లేక ఒక కొరియన్ సినిమా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తే వాళ్లు ఇద్దరు టాప్ హీరోలతో పనిచేయవచ్చు. మరి తెలుగులో ఆ సినిమాను డీల్ చేసే దమ్మున్న డైరెక్టర్ ఎవరా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. తదుపరి సమాచారం కోసం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే మరి..