Begin typing your search above and press return to search.

పవన్‌ సినిమా కోసం మరో స్టార్ హీరోని రికమెండ్ చేస్తున్న ఫ్యాన్స్..!

By:  Tupaki Desk   |   4 Nov 2020 3:00 PM IST
పవన్‌ సినిమా కోసం మరో స్టార్ హీరోని రికమెండ్ చేస్తున్న ఫ్యాన్స్..!
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అధికారికంగా మేకర్స్ ప్రకటించనప్పటికీ ఇది మలయాళ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. బిజూ మీనన్ - పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. బిజూ మీనన్ పోషించిన నిజాయితీగల పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో పవన్‌ కనిపించనున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు అయ్యప్ప కి ధీటుగా నిలిచే కోశి పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.

మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రకి గాను చాలా మంది హీరోల పేర్లే వినిపించాయి. ముందుగా దగ్గుబాటి రానా ఆ రోల్ లో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత యువ హీరోలు నితిన్ - సాయి ధరమ్ తేజ్ లు ఆసక్తి కనబరుస్తున్నారని అనుకున్నారు. అలానే కన్నడ హీరో కిచ్చ సుదీప్ ఆ పాత్రలో కనిపించనున్నాడని న్యూస్ వచ్చింది. వీరితో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ పాత్రలో వీళ్ళెవరూ వద్దని.. సోషల్ మీడియా వేదికగా మరొక స్టార్ హీరోని రికమెండ్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ అయితే పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలుస్తాడని.. అందుకే రవితేజ ని ఆ పాత్ర కోసం ప్రొడ్యూసర్స్ కన్సిడర్ చేయాలని అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆఫ్ స్క్రీన్ లో పవన్ - రవితేజ చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని మేకర్స్ కన్సిడర్ చేస్తారో లేదో చూడాలి.