Begin typing your search above and press return to search.

మలయాళ రీమేక్ ని హోల్డ్ లో పెట్టేశారా...?

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:00 AM IST
మలయాళ రీమేక్ ని హోల్డ్ లో పెట్టేశారా...?
X
తెలుగులో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మలయాళ సినిమా ''అయ్యప్పనుమ్ కోషియుమ్''. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ మూవీ అక్కడ ఘన విజయం సాధించింది. మాలీవుడ్ స్టార్ హీరోలు పృథ్వీరాజ్ - బిజూ మీనన్ లు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగోల వల్ల వారి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించబడింది. తెలుగు ప్రేక్షకులకు ఈ స్టోరీ కనెక్ట్ అవుతుందని భావించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇక అప్పటి నుండి తెలుగు రీమేక్ లో ఎవరు నటించబోతున్నారు.. ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటి వరకు దర్శకుడు - హీరోలు ఎవరనే దానిమీద క్లారిటీ రాలేదు. ఈ ప్రాజెక్ట్ లో నటించే హీరోలు అంటూ అనేకమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ముందుగా బాలకృష్ణ - దగ్గుబాటి రానా అని.. బాలయ్య - మంచు విష్ణు.. రవితేజ - రానా అంటూ అనేక కాంబోలు వచ్చాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాపై మనసు పారేసుకున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే ఏదీ సెట్ అయినట్లు ప్రకటించలేదు. అయితే మేకర్స్ ఈ సినిమాని ఇప్పుడప్పుడే తెలుగులో రీమేక్ చేసే ప్లాన్ లో లేర‌ని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

ఈ సినిమా కోసం తెలుగులో సూట్ అయ్యే హీరోలు లేక‌పోవ‌డం.. సరిపోయే హీరోలు కూడా ప్ర‌స్తుతం బిజీగా ఉండటమే దీనికి అస‌లు కార‌ణమని అనుకుంటున్నారు. అందుకే ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారని.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ముందుగా కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ ని తెర‌కెక్కించే అవ‌కాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేకర్స్ దీనిపై త్వరలోనే స్పందించి ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తలకు చెక్ పెడతారేమో చూడాలి.