Begin typing your search above and press return to search.
ప్రస్తుతానికి ఆ సూపర్ హిట్ రీమేక్ లేనట్లే!
By: Tupaki Desk | 20 July 2020 11:45 AM ISTఈమద్య కాలంలో మలయాళంకు చెందిన నాలుగు సినిమాల గురించి తెలుగు మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఆ నాలుగు సినిమాల రీమేక్ కోసం తెలుగు ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్నారు. లూసీఫర్ ను మెగాస్టార్ రీమేక్ చేయబోతుండగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రాల రీమేక్స్ విషయంలో క్లారిటీ రాలేదు. త్వరలోనే ఆ రెండు సినిమాలకు సంబంధించిన రీమేక్స్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఎలాంటి చర్చలు జరగడం లేదు. కాని నిన్న మొన్నటి వరకు అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమేక్ గురించిన చర్చలు జరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఈ రీమేక్ రైట్స్ ను దక్కించుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారంటూ ప్రచారం జరిగింది. కొందరు నటుల పేర్లు కూడా ప్రస్థావనకు వచ్చాయి. ఇలాంటి సమయంలో సినిమాను కొంత కాలం పాటు పక్కన పెట్టాలనే నిర్ణయానికి నిర్మాత వచ్చాడట.
కరోనా కారణంగా స్టార్స్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. దాంతో ఈ సినిమాలో నటించేందుకు హీరోలు డేట్లు లేవంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరితోనో ఒకరితో సినిమాను పూర్తి చేయకుండా కాస్త ఆలస్యం అయినా కూడా కథకు తగ్గట్లుగా సరైన హీరోలను ఎంపిక చేయాలనే నిర్ణయానికి నిర్మాత వచ్చాడట. అందుకే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చిత్రంను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది.