Begin typing your search above and press return to search.

'అయ్యప్పన్ కోషియం' రీమేక్ స్క్రిప్ట్ 'పవన్ కళ్యాణ్'దేనట.. ఎలాగంటే?

By:  Tupaki Desk   |   26 Jan 2021 8:30 AM GMT
అయ్యప్పన్ కోషియం రీమేక్ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్దేనట.. ఎలాగంటే?
X
తెలుగు పరిశ్రమలో మెల్లగా మార్పులు జరుగుతున్నాయి. ఎలాగంటే ఇదివరకు తెలుగులో హిట్ అయిన సినిమాలను వేరే భాషల వారు రీమేక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు తెలుగువారు పరభాషలో సూపర్ హిట్టయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. అందులో మల్టీస్టారర్ సినిమాలంటే ఆ సందడి వేరే ఉంటుంది. ప్రస్తుతం రొటీన్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసి కథాకథనాల పై దృష్టి పెడుతున్నారు తెలుగు హీరోలు. అయితే క్యారెక్టర్ బాగుంటే ఏ హీరో సినిమా అయినా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల వైపు చోటా హీరోల దగ్గర నుండి బడా హీరోల వరకు మొగ్గు చూపుతున్నారు. ఇక గతేడాది మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న సినిమా అయ్యప్పన్ కోషియం. ఈ సినిమా రీమేక్ తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడిన ఈ సినిమా తెలుగు షూటింగ్ సంక్రాంతి తర్వాత ప్రారంభించారు మేకర్స్. అయితే ఈ సినిమా తెలుగు స్క్రిప్ట్, డైలాగ్స్ త్రివిక్రమ్ రాసిన విషయం విదితమే. అయితే మలయాళంలో అక్కడి విలువలను.. పద్ధతులను దెబ్బతినకుండా తెరకెక్కించాడు డైరెక్టర్ సాచి.. అంతే అద్భుతంగా ఎమోషన్స్ క్యాచ్ చేసి మెప్పించాడు. అయితే తెలుగులో కూడా జనాలకు, తెలుగు సంస్కృతికి దగ్గరగా ఉండేలా మార్పులు చేసాడట త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ పాత్రలో, రానా కోషి పాత్రలో నటించనున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ నటిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు.

అలాగని చివరి వరకు ఆయన కూడా బయటికి చెప్పలేదు. అయితే అంతకుముందు కోషి పాత్రకి రానా ఓకే అనుకున్నా.. అయ్యప్పన్ పాత్రలో మాత్రం పవన్ తప్ప మిగతా హీరోలను ఊహించుకున్నారు. రవితేజ, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వారి పేర్లు వినిపించాయి. ఇక సడన్ గా పవన్ కన్ఫర్మ్ అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయారు. అయితే పవన్ ఆ క్యారెక్టర్ ఎలా క్యారీ చేస్తాడనే సందేహం అందరిలో నెలకొంది. కానీ త్రివిక్రమ్ ఉన్నది ఆ లోటు తీర్చడానికే కదా.. అంటున్నారు మేకర్స్. ఈ స్క్రిప్ట్ లో పవన్ కళ్యాణ్ అనేలా కాకుండా ఈ స్క్రిప్ట్ పవన్ దే అనుకునేలా రెడీ చేసాడట. ఇదివరకు గబ్బర్ సింగ్ దబాంగ్ రీమేక్ అయినా ఆ ఫీల్ కలిగించలేదు. చూడాలి మరి త్రివిక్రమ్ ఏ విధంగా స్క్రిప్ట్ డిజైన్ చేసాడో..!!