Begin typing your search above and press return to search.

సామ్ క్యూలో ఆయుష్ విక్కీ అక్కీ.. ఇంకా ఎవ‌రు?

By:  Tupaki Desk   |   8 July 2022 5:30 AM GMT
సామ్ క్యూలో ఆయుష్ విక్కీ అక్కీ.. ఇంకా ఎవ‌రు?
X
స‌మంత ఫోక‌స్ ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ పైనే ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో రాజీ పాత్ర‌తో మెప్పించిన సామ్ పుష్ప లో 'ఊ అంటావా..' సాంగ్ తో ఉత్త‌రాది యూత్ ని ఒక రేంజులో షేక్ చేసింది. బాలీవుడ్ లో ఈ సాంగ్ ఒక రేంజులో క్లిక్క‌య్యింది. అక్క‌డ యువ‌హీరోల చూపంతా ఇప్పుడు స‌మంత‌పైనే ఉంది.

దీంతో హిందీలో వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయ‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇంత‌కుముందే ఆయుష్మాన్ ఖురానా సినిమాతో బాలీవుడ్ లోకి స‌మంత అడుగు పెట్ట‌డం కన్ఫామైంద‌ని టాక్ వినిపించింది. స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌నా న‌టించ‌నుంద‌ని గుస‌గుస వినిపించింది. ఇంత‌లోనే సంచ‌ల‌నాల యూరి ఫేం విక్కీ కౌశ‌ల్ స‌ర‌స‌న భారీ చిత్రంలో న‌టించ‌నుంద‌న్న టాక్ స్ప్రెడ్ అవుతోంది.

విక్కీ కౌశల్ -ఆదిత్య ధర్ కాంబినేష‌న్ లో 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ'లో సమంత రూత్ ప్రభు జాయిన‌వుతోందంటూ ప్ర‌చారం సాగుతోంది. సమంతా రూత్ ప్రభు త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. దినేష్ విజన్ తదుపరి చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా స‌ర‌స‌న‌ అరంగేట్రం చేయ‌నుంది. త‌దుప‌రి విక్కీ కౌశల్ 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' కోసం ద‌ర్శ‌క‌నిర్మాత ఆదిత్య ధర్ తో చర్చలు సాగిస్తోంద‌ని కూడా టాక్ వైర‌ల్ అవుతోంది.

ఆదిత్యా ధర్ స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడు. విక్కీ స‌ర‌స‌న నాయిక‌గా స‌మంత‌ను ఊహించుకుంటున్నాడ‌ని అందుకే త‌న‌తో అధునాతన రీతిలో త‌న‌తో చర్చలు సాగిస్తున్నాడ‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. ఈ చిత్రం 2023లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్ర‌స్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆదిత్యధ‌ర్ చివరకు తన స్టూడియో భాగస్వామి ఆమోదించిన బ‌డ్జెట్ ప‌రిమితిని ఆమోదించాడ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. సమంతకు ఆదిత్యధ‌ర్ సృజించిన ఈ స‌రికొత్త‌ ప్రపంచం నచ్చిందని కూడా ఒక రిపోర్ట్ చెబుతోంది. అన్నీ కుదిరితే యాక్షన్ తో కూడిన పాత్రలో స‌మంత‌ కనిపించనుంది.

మరోవైపు విక్కీ ప్రస్తుతం 'సామ్ బహదూర్' కోసం ప్రిపరేషన్ తో బిజీగా ఉన్నాడు. 6-8 నెలల పాటు ఈ బయోపిక్ కోసం స‌మ‌యం కేటాయిస్తాడు. అటుపై మరో సినిమా చేస్తాడట. ఆ తరువాత అతను ఆదిత్య ధ‌ర్ తో తదుపరి షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆయుష్మాన్ తదుపరి చిత్రంలో సమంత నాయిక‌గా న‌టిస్తుంద‌ని పుకార్లు వచ్చాయి. తాప్సీ పన్ను నిర్మించే మిడ్ రేంజ్ సినిమాలోనూ న‌టించ‌నుంది. కరణ్ జోహార్ నిర్మించే సినిమాలో అక్షయ్ కుమార్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వ‌రుస‌గా నాలుగైదు హిందీ చిత్రాల‌కు స‌మంత క‌మిట‌వుతోంది. అందువ‌ల్ల ముంబైలో ఒక స్థిర‌నివాసం ఏర్పాటు చేసుకుంద‌న్న టాక్ ఉంది. స‌మంత న‌టించిన శాకుంత‌లం - య‌శోద విడుద‌ల‌కు రానున్నాయి. అలాగే ఓబేబి నిర్మాత‌ల‌తో క‌లిసి హాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.