Begin typing your search above and press return to search.

సూప‌ర్ భామ మ‌మ్మీ ఆట‌

By:  Tupaki Desk   |   11 Jan 2016 9:30 AM GMT
సూప‌ర్ భామ మ‌మ్మీ ఆట‌
X
స్పీడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డిస్క‌వ‌రీ అయేషా ట‌కియా. సూప‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. అంత‌కంటే ముందే కొన్ని పాప్ ఆల్బ‌మ్స్‌ తో ఈ అమ్మ‌డు అంద‌రికీ సుప‌రిచిత‌మే. బాలీవుడ్‌ లో స‌ల్మాన్‌ ఖాన్ స‌ర‌స‌న వాంటెండ్ చిత్రంలో న‌టించింది. అటు బాలీవుడ్‌ - ఇటు టాలీవుడ్ రెండు చోట్లా సూప‌ర్‌ స్టార్ ల‌తోనే కెరీర్ ప్రారంభించింది. అయినా ఎందుక‌నో అయేషా కెరీర్ ఆశించిన స్థాయిలో వెలిగిపోలేదు. అందానికి అందం - అదిరిపోయే సెక్స‌ప్పీల్‌ - ముఖాభిన‌యం - ఆహార్యం ఈ అమ్మ‌డి సొంతం. ఇన్ని ఉన్నా ఎందుక‌నో కెరీర్ ప‌రంగా ప‌రిమితం అయిపోయింది.

కాల‌క్ర‌మంలో ఫ‌ర్హాన్ అజ్మిని పెళ్లాడిన త‌ర్వాత ఇక పూర్తిగా సినిమాల‌కు స్వ‌స్తి చెప్పేసింది. అయేషా ట‌కియా ఏమైపోయింది? అంటూ అభిమానులు బోలెడంత గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. క‌ట్ చేస్తే అయేషా ట‌కియా ప్ర‌స్తుతం ఓ బిడ్డ‌కి త‌ల్లిగా సంసార జీవ‌నంలో మునిగిపోయింది. త‌న గారాల‌ప‌ట్టీ ఆల‌నా పాల‌న‌లోనే ఆనందాన్ని ఆస్వాధిస్తోంది. త‌న బిడ్డ పేరు మికాయిల్‌. త‌న‌ని ముద్దాడుతున్న ఓ ఫోటోని ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో పోస్ట్ చేసింది ట‌కియా. ఆ పిక్ చూస్తే త‌ల్లి బిడ్డ‌ల అనుబంధానికి కేరాఫ్ అడ్రెస్ అని మీరే చెబుతారు. అంత‌టి అన్యోన్య‌త‌, పేగుబంధం ఆ ఫోటోలో క‌నిపించింది మ‌రి.