Begin typing your search above and press return to search.

సూప‌ర్ హీరోయిన్‌...ఇలా అయిపోయిందేంటీ?

By:  Tupaki Desk   |   15 Sep 2016 3:30 PM GMT
సూప‌ర్ హీరోయిన్‌...ఇలా అయిపోయిందేంటీ?
X
ఆయెషా ట‌కియా.. గుర్తుండే ఉంటుంది! అప్ప‌ట్లో నాగార్జునతో సూప‌ర్ అనే చిత్రంలో న‌టించింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆయెషా ముద్దుగా బొద్దుగా క‌నిపించి కుర్రాకారును బాగానే ఆక‌ట్టుకుంది. బొద్దుత‌న‌మే ఆమెకి అందం. నిజానికి - బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయెషా టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎద‌గ‌లేక‌పోయింది. టాప్ హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు వ‌చ్చినా... ఎందుకో ఒక వెలుగు వెల‌గ‌లేక‌పోయింది. తెలుగులో ఎంట్రీ ఇచ్చినా కూడా.. ఇక్క‌డా స‌రైన ఛాన్సులు రాలేదు. 2009లో ఫ‌ర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింద‌ని చెబుతున్నారు. ఆ ప్ర‌య‌త్నాల్లో భాగంగానే ఇదిగో ఇలా త‌యారైంద‌ని అంటున్నారు.

ఒక‌ప్పుడు బొద్దుగా సెక్సీగా క‌నిపించిన ఆయెషా - ఇప్పుడు ఇలా స‌న్న‌బ‌డింది! బిడ్డ పుట్టిన త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించాల‌న్న కోరిక‌తోనే ఈ మ‌ధ్య ఫిజిక్ మీద దృష్టి పెట్టింద‌ని చెబుతున్నారు. ఆమె ఇలా స్లిమ్ముగా త‌యారు కావ‌డానికి జిమ్ముకు వెళ్ల‌లేద‌నీ - సర్జ‌రీ చేయించుకుని ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ స్కిన్నీ లుక్కుతో కొన్ని సెల్ఫీలు దిగి - త‌న ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఆయెషా ట‌కియా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అంటూ ఓ క్యాప్ష‌న్ పెట్టి ఈ చిత్రాల‌ను పెట్టింది. ఈ ఫొటోలు చూసిన‌వాళ్లంతా ఆశ్చ‌ర్యపోతున్నారు! ఆయెషాకు ఏమైంద‌ని కామెంట్లు పెడుతున్నారు. ‘మిల‌మిల మెరిసిన క‌నుల‌కు’ అంటూ సూప‌ర్ లో బొద్దుగా అందాల‌తో రెచ్చిపోయి క‌నిపించిన ఆయెషాను గుర్తు చేసుకుంటూ... నాగ్ హీరోయిన్ కి ఏమైంద‌ని అంటున్నారు! త‌న సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభం కోస‌మే ఇలా లుక్ మార్చేసి ఉంటుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.