Begin typing your search above and press return to search.

కెమెరా మ్యాన్ కు కూడా అదే డీల్

By:  Tupaki Desk   |   3 July 2017 10:11 AM GMT
కెమెరా మ్యాన్ కు కూడా అదే డీల్
X
నిర్మాత దిల్ రాజు పెద్ద డీల్ మాష్టర్ అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన ఎవ్వరితో సినిమా చేసినా కూడా సదరు డైరక్టర్ తో ఒకేసారి రెండు మూడు సినిమాలకు ఒప్పందాలు చేసుకుంటాడు. కొత్తగా దర్శకత్వం ఛాన్సిచ్చిన వంశీ పైడిపల్లి.. వాసు వర్మ.. ఇలా ఎవరైనా కూడా దిల్ రాజు వాళ్ళతో రెండో సినిమా కూడా చేయించాకే తన క్యాంపు నుండి బయటకు పంపిస్తాడు. ఇప్పుడు ఇదే డీల్ మ్యానియాను ఇతర నటులకు టెక్నీషియన్లకు కూడా రాజు గారు ఎక్స్టెండ్ చేసినట్లున్నారు.

'డిజె దువ్వాడ జగన్నాథమ్' సినిమాతో ఇప్పుడు సరికొత్త సెక్సీ ఇమేజ్ సాధించిన పూజా హెగ్డేతో ఆల్రెడీ రెండు సినిమాల డీల్ చేశారట రాజు గారు. అలాగే 'ఫిదా' మూవీ ఫేం సాయిపల్లవితో కూడా మనోడు రెండు సినిమాల ఎగ్రిమెంట్ చేసుకున్నాడు. అలాగే డిజె డైరక్టర్ హరీశ్ శంకర్ కూడా తదుపరి సినిమాను ఏ హీరోతో తీసినా ఏ కథతో తీసినా కూడా అది దిల్ రాజు బ్యానర్ లోనే చేయాలి. ఇకపోతే ఇప్పుడు డిజె సినిమాటోగ్రాఫర్ అయానక బోస్ కూడా అంతేనట. మనోడు కూడా రాజుగారి క్యాంపులో మరో సినిమా చేయడానికి ఆల్రెడీ ఎప్పుడో డీల్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. డిజె లో ఇతన కెమెరా పనితనం ఎలాగో చాలా బాగుందనే పేరొచ్చింది కాబట్టి.. ఇతనితో వర్క్ చేయడానికి దాదాపు అందరి హీరోలు రెడీయే. కాబట్టి బోస్ కు డీల్ ప్లస్సేలే.

మొత్తానికి ఒక యాక్టర్ కు ఎక్కువ డబ్బులిచ్చి డేట్లు పట్టేసి ప్రొడ్యూసర్లు ఉన్న ఈ రోజుల్లో.. అదే యాక్టర్ తో బేరాలాడి ఒకేసారి రెండు సినిమాల డీల్ తక్కువ డబ్బులకే చేసుకునే ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటూ ఇండస్ర్టీలో మాట్లాడుకుంటున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/