Begin typing your search above and press return to search.

PS-1 నుంచి అద్భుత మెలోడి `అలైక‌డ‌ల్`

By:  Tupaki Desk   |   20 Sep 2022 2:13 PM GMT
PS-1 నుంచి అద్భుత మెలోడి `అలైక‌డ‌ల్`
X
ఐశ్వ‌ర్య మీన‌న్ .. ద‌శాబ్ధ కాలంగా సౌత్ లో ఈ బ్యూటీ క‌థానాయికగా కెరీర్ ర‌న్ కొన‌సాగిస్తోంది. ప‌దేళ్ల‌ క్రిత‌మే చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్ స‌ర‌స‌న `ల‌వ్ ఫెయిల్యూర్` అనే చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మైంది. మ‌ల్లూ బ్యూటీ అంద‌చందాల‌కు బోయ్స్ ఫిదా అయ్యారు. కానీ ఆశించిన విజ‌యం ద‌క్క‌క‌పోవ‌డంతో కెరీర్ ప‌రంగా బిజీ కాలేక‌పోయింది. ఆ త‌ర్వాత త‌మిళం క‌న్న‌డంలో కొంత‌కాలం కాలక్షేపం చేసింది. ఇప్పుడు మ‌రోసారి టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ 69వ సినిమాలో అవ‌కాశం అందుకుంది. మ‌రో క‌థానాయిక‌తో పాటు ఈ చిత్రంలో న‌టించ‌నుంది. త్రినాథ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అలాగే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియ‌న్ సెల్వ‌న్ - 1`లోనూ ఐశ్వ‌ర్య‌మీన‌న్ ఓ క‌థానాయిక‌గా న‌టించింది. కార్తీ తో ప్రేమాయ‌ణం సాగించే ఎంకి భామ‌లా అందంగా క‌నిపిస్తోంది. క‌డ‌లిలో నావ‌పై శృంగారాన్ని ఈ లుక్ గొప్ప‌గా ఆవిష్క‌రించింది. తాజాగా అల‌క‌డ‌లా.. అంటూ సాగే ఓ లిరిక‌ల్ మోష‌న్ ప్రోమోని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. మెలోడి ఎంతో అందంగా శ్రావ్యంగా హృద‌యాల‌ను హ‌త్తుకుంటోంది. పిక్చ‌రైజేష‌న్ ప‌రంగాను మ‌ణిర‌త్నం మార్క్ ఈ పాట‌లో క‌నిపిస్తోంది. కానీ ఈ పాట‌ను ఆల‌పించిన స్వ‌రం సిధ్ శ్రీ‌రామ్ త‌ర‌హాలో ప‌దోచ్ఛార‌ణ (తెలుగు భాష‌) విష‌యంలో సంపూర్ణత కొర‌వ‌డింద‌ని అర్థ‌మ‌వుతోంది.

`పొన్నియిన్ సెల్వన్` ఐదు భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కరోనా క్రైసిస్ వ‌ల్ల చాలా ఆల‌స్యంగా షూట్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు స్పీడ్ గా సాగుతున్నాయి. ఇందులో విక్రమ్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ - జయం రవి- కార్తీ- త్రిష- ఐశ్వర్య లక్ష్మి- శోభితా ధూళిపాళ- ప్రభు- ఆర్. శరత్ కుమార్- విక్రమ్ ప్రభు- జయరామ్ప్ర- ప్ర‌కాష్ రాజ్- రెహమాన్- ఆర్. పార్తిబన్ వంటి తార‌లు న‌టిస్తున్నారు. విక్రమ్ ఆదిత్య కరికాలన్ టైటిల్ రోల్ లో కనిపించనుండగా.. నందినిగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించింది. వంతీయతేవన్ పాత్రలో కార్తీ- కుందవై పాత్రలో త్రిష- అరుణ్ మొళి వర్మన్ గా జయం రవి కనిపించనున్నారు.

10వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో ఆధిపత్య పోరును తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మిది. 1950ల నాటి `కల్కి` అనే ఎవర్ గ్రీన్ తమిళ నవలకి సినిమాటిక్ అనుసరణ. ఇది కావేరీ నది కుమారుడైన పొన్నియిన్ సెల్వన్ భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తులలో ఒకరిగా మారడానికి ముందు క‌థ‌.. రాజరాజ చోళుడుగా పొన్నియ‌న్ గొప్ప‌ పిలుపును అందుకున్నారు. గొప్ప చ‌క్ర‌వ‌ర్తిగానూ పేరు తెచ్చుకున్నారు.

శ్రీ సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ -లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. రెండో భాగంపైనా మ‌ణిర‌త్నం వ‌ర్క్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.